వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాతో చర్చలకు ఉ.కొరియా సై: అగ్రరాజ్యం మెలిక, చొరవ చూపిన రష్యా

By Narsimha
|
Google Oneindia TeluguNews

వియన్నా:తమ అణు విధానంపై అమెరికాతో ప్రత్యక్షంగా బహిరంగంగా చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయ్‌ లారోవ్‌ తెలిపారు. ఈ విషయాన్ని తాను అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌కు కూడ తెలిపానని సెర్జెయ్ లారోవ్ చెప్పారు.

కిమ్‌కు షాక్: ఆ భయంతో సైనికుల పరార్, అంతు చిక్కని వ్యాధులుకిమ్‌కు షాక్: ఆ భయంతో సైనికుల పరార్, అంతు చిక్కని వ్యాధులు

ఉత్తరకొరియా కొంత కాలంగా అణ పరీక్షలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండడంపై ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఉత్తరకొరియాపై పలు ఆంక్షలను విధించింది.

ట్రంప్‌కు పుతిన్ షాక్: 'ఉ.కొరియాతో సంబంధాలు తెంచుకోం, ఆంక్షలు'ట్రంప్‌కు పుతిన్ షాక్: 'ఉ.కొరియాతో సంబంధాలు తెంచుకోం, ఆంక్షలు'

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడ ఉత్తరకొరియాపై ఆంక్షలను విధించింది. రెండు వారాల క్రితం ఉత్తరకొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణి అత్యంత శక్తివంతమైందని రక్షణ నిపుణులు తేల్చి చెప్పారు.

కిమ్‌కు షాక్: ఉ.కొరియాకు పోటీగా ద. కొరియా క్షిపణి ప్రయోగం, యుద్దం తప్పదా?కిమ్‌కు షాక్: ఉ.కొరియాకు పోటీగా ద. కొరియా క్షిపణి ప్రయోగం, యుద్దం తప్పదా?

<strong></strong>కిమ్‌కు ట్రంప్ షాక్: 'ఉత్తర కొరియాను నాశనం చేస్తాం, యుద్దం కోరుకొంటుంది'కిమ్‌కు ట్రంప్ షాక్: 'ఉత్తర కొరియాను నాశనం చేస్తాం, యుద్దం కోరుకొంటుంది'

 అమెరికాతో చర్చలకు ఉత్తరకొరియా సిద్దమే

అమెరికాతో చర్చలకు ఉత్తరకొరియా సిద్దమే

అణు విధానంపై అమెరికాతో ప్రత్యక్షంగా బహిరంగంగా చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని రష్యా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టెల్లర్‌సన్‌తో కూడ తాను ఈ విషయాన్ని చెప్పానని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జెయ్ లారోవ్ ప్రకటించారు. అయితే రెండు దేశాల మధ్య ఉప్పు, నిప్పు మాదిరిగా ఉన్న పరిస్థితి సెర్జెయ్ ప్రకటనతో కొంత ప్రశాంతత నెలకొంది.

 అమెరికా నుండి స్పందన లేదు

అమెరికా నుండి స్పందన లేదు

అణు విధానంపై చర్చలకు ఉత్తర కొరియా సిద్దంగా ఉన్నప్పటికీ అమెరికా నుండి సానుకూల స్పందన రాలేదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జెయ్ అభిప్రాయపడ్డారు.ఈ విషయమై తాను టెల్లర్‌సన్‌తో చర్చించినప్పటికీ టిల్లర్‌ సన్‌ నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదని సెర్జెయ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అణు కార్యక్రమాలు వదిలితేనే

అణు కార్యక్రమాలు వదిలితేనే

ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాలను వదిలేసుకుంటేనే ముందుకు వెళతామనే ఆలోచనలో ఉన్నట్లు అర్థమైందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జెయ్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరిగితే ప్రపంచ దేశాలకు ఇబ్బంది లేకుండా పోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి సమక్షంలో

ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి సమక్షంలో

ఐక్యరాజ్యసమితి ఉన్నత శ్రేణి అధికారి జెఫ్రీ ఫెల్ట్‌మేన్‌ ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రియాంగ్‌ హోను ప్యాంగ్‌యాంగ్‌లో కలిసిన సందర్భంగా చర్చల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని, అందుకు ఉత్తర కొరియా సానుకూలంగా స్పందించిందని తెలిపారు.గురువారం వియన్నాలో జరిగిన దౌత్య వేత్తల సమావేశంలో తాను ఈ సందేశాన్ని చెప్పినట్లు వివరించారు.

English summary
North Korea is open to direct talks with the US over their nuclear standoff, according to the Russian foreign minister, Sergei Lavrov, who said he passed that message to his counterpart, Rex Tillerson, when the two diplomats met in Vienna on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X