వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం తల్చుకుంటే..: ఉ.కొరియా భయంకర వీడియో

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియా మరోసారి వివాదానికి తెరలేపింది. తాము తలుచుకుంటే దక్షిణ కొరియాను భస్మం చేస్తామని బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. ఈ వీడియో చాలా భయంకరంగా ఉంది.

ఏకకాలంలో వందల సంఖ్యలో క్షిపణులు దక్షిణ కొరియాలోని ప్రధాన భవంతులన్నింటిని నామరూపాల్లేకుండా నేలమట్టం చేస్తున్నట్లుగా ఉంది. జనవరి 6న అణుపరీక్ష నిర్వహించినప్పటి నుంచి ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అప్పటి నుంచి దక్షిణ కొరియా, మరోపక్క వాషింగ్టన్ పరోక్షంగా ఉత్తర కొరియాను హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వాటన్నింటిని బేఖాతరు చేస్తూ తాజాగా రెచ్చగొట్టేలా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. తక్కువ బడ్జెట్ ఎక్కవ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ వీడియో భయంకరంగా ఉంది.

North Korea releases ultimatum video showing attack destroying Seoul

ఉత్తర కొరియా సైనికులంతా కూడా అప్రమత్తమై సరిహద్దు ప్రాంతానికి వేల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా చేరగా, క్షిపణులన్నింటిని దక్షిణ కొరియా వైపు లక్ష్యంగా పెట్టారు. ముఖ్యంగా సియోల్‌ను టార్గెట్ చేశారు. అంతా సిద్ధమై ఉండగానే ప్రధాన అధికారి ఫైర్ అంటూ సిగ్నల్ ఇస్తారు.

దీంతో ఏకకాలంలో వందల ఫిరంగులు పేల్చడంతో వాయు వేగంతో దూసుకెళ్లిన క్షిపణులు నేరుగా సియోల్‌లోని అధ్యక్ష భవనాన్ని, ఇతర ముఖ్య కార్యాలయాలను ధ్వంసం చేశాయి. తాము తల్చుకుంటే సర్వం బూడిద చేస్తామని హెచ్చరికలు కూడా వీడియోలో ఉన్నాయి.

English summary
North Korea releases ultimatum video showing attack destroying Seoul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X