వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షం, ఎరువుల కర్మాగారం ప్రారంభిస్తూ, ఉత్తరకొరియా నియంత చిరుదరహాసం...

|
Google Oneindia TeluguNews

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ శుక్రవారం ప్రత్యక్షమయ్యారు. రాజధాని ప్యొంగ్యాంగ్ సమీపంలో గల సన్‌చాన్ వద్ద కనిపించారు. గత మూడు వారాల నుంచి కిమ్.. కనిపించకపోవడంతో చనిపోయారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే 21 రోజుల తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చారని నార్త్ కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ నివేదించింది.

Recommended Video

Kim Jong Un's Factory Opening Photos, Those Are New Photos Or Not?

కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమం?: పెంటగాన్ ఏం చెప్పిందంటే..?కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమం?: పెంటగాన్ ఏం చెప్పిందంటే..?

ఎరువుల కర్మగారం ప్రారంభిస్తూ..

ఎరువుల కర్మగారం ప్రారంభిస్తూ..


సన్ చాన్ వద్ద ఎరువుల కర్మగారాన్ని ప్రారంభించారు. గతనెల 11వ తేదీన జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరైన తర్వాత కిమ్.. కనిపించలేదు. దీంతో అతనికి ఏమైంది..? అనారోగ్యంతో చనిపోయారా అనే వార్తలు వినిపించాయి. కానీ శుక్రవారం కిమ్ మీడియాలో కనిపించడంతో చూసిన వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

తాత, తండ్రి సంతోషం

తాత, తండ్రి సంతోషం

తాను ఎరువుల కర్మగారాన్ని ప్రారంభించానని తెలిసి తన తాత కిమ్ 2, తన తండ్రి కిమ్ జాంగ్ 2 సంతోషపడతారని కిమ్ జాంగ్ ఉన్ పేర్కొన్నారు. తర్వాత తన సోదరి కిమ్ యో జాంగ్‌తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. వాస్తవానికి ఏప్రిల్ 15వ తేదీన నార్త్ కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాతా కిమ్ 2 జయంతి. అంతటి విశిష్టత కలిగిన రోజు కిమ్.. కనిపించకపోవడంతో ఏం జరిగిందనే ఉత్కంఠ నెలకొంది. ఆరోగ్యం బాగోలేదని ప్రచారం జరిగింది. కిమ్ చనిపోతే అతని వారసుడు ఎవరూ అని కూడా చర్చ జరిగింది.

వారం కిందటే...

వారం కిందటే...


దక్షిణ కొరియా అధ్యక్షుడి భద్రతా సలహాదారు మూ జే మాత్రం కిమ్ బాగున్నారని.. అతనికి ఏం కాలేదని పేర్కొన్నారు. నార్త్ కొరియాకు తూర్పున గల మూన్ చాంగ్ రిసార్ట్‌లో కిమ్ ఉన్నారని ఆయన సీఎన్ఎన్ వార్తాసంస్థకు రిపోర్ట్ చేశారు. ఏప్రిల్ 13వ తేదీ నుంచి కిమ్ ఆరోగ్యంపై ఊహాగానాలు నెలకొన్న క్రమంలో వారం కిందట మూన్ జే పేర్కొన్నారు. అతను చెప్పిన మాదిరిగానే మ్ జోన్ ఉన్ ప్రత్యక్షమయ్యారు. తమ అధినేత కనిపించడంతో ఉత్తర కొరియా జనాల సంతోషానికి అవధి లేకుండా పోయింది.

English summary
North Korean leader Kim Jong Un has made his first public appearance since speculation about his health began last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X