• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గెలిచి తీరుతాం: ప్రతినబూనిన 'కిమ్'.., ఆ సదస్సులో ఇలా!, భయంలో అమెరికా?

|

ప్యోంగ్‌యాంగ్: ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా.. దౌత్య సంబంధాలను ఐక్యరాజ్య సమితి నిలువరిస్తున్నా.. ఉత్తరకొరియా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భవిష్యత్తులో మరింత అత్యాధునిక అణ్వాయుధాలను తయారు చేసుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా ప్రతినబూనారు.

  Kim Jong Un : 8 Strange And Ridiculous Facts 8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి | Oneindia

  గత నెల 29న అత్యంత దూరం ప్రయాణించగల ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం)ని విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో మంగళవారం కిమ్ అణ్వాయుధ సిబ్బందితో సమావేశమయ్యారు.

  దేశ రక్షణ పరిశ్రమ అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందని, అమెరికాతో, సామ్రాజ్యవాదులతో పోరాటంలో ఉత్తరకొరియా గెలిచి తీరుతుందని కిమ్ మరోసారి స్పష్టం చేశారు.

   శాస్త్రవేత్తలకు కిమ్ అభినందన:

  శాస్త్రవేత్తలకు కిమ్ అభినందన:

  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు క్షిపణులను తయారుచేస్తున్నందుకు అక్కడి శాస్త్రవేత్తలను కిమ్ జాంగ్ అభినందించారు. హ్వసాంగ్-15 క్షిపణి ద్వారా ఉత్తరకొరియా అణు శక్తి ప్రపంచ దేశాలు కన్నా చాలా ముందంజలో ఉందని కిమ్ భావిస్తున్నారు.

   మరిన్ని తయారుచేయాలని:

  మరిన్ని తయారుచేయాలని:

  అణు ఆయుధాలపై రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో కిమ్ జాంగ్ మాట్లాడారు. శాస్త్రవేత్తలు, సిబ్బంది మరిన్ని ఆయుధాలను తయారుచేయడంలో నిమగ్నం అవాలని ఈ సందర్భంగా కిమ్ పిలుపునిచ్చారు. నాణ్యతలోను, సంఖ్యలోను ఉత్తరకొరియా అణు శక్తి చాలా ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులోను ఉత్తరకొరియా అణ్వాయుధ తయారీకి ఫుల్ స్టాప్ పడదని తెలియడంతో.. అమెరికాకు మరింత భయం పట్టుకునే అవకాశముంది.

  'రుతుస్రావం'.. కొన్ని కఠిన నిజాలు: ఉ.కొరియాలో మహిళా సైనికుల దీనగాథ.. స్నానం చేయాలన్నా!

   కొరియన్ మీడియా:

  కొరియన్ మీడియా:

  ' అణ్వాయుధ తయారీపై కిమ్ జాంగ్ చాలా గంభీరమైన ప్రకటన చేశారు. ఆటంబాంబు, హైడ్రోజన్ బాంబులతో పాటు ఐసీబీఎం హ్వసాంగ్-15 లాంటి క్షిపణులను తయారుచేయడం ఉత్తరకొరియా సాధించిన చారిత్రక విజయం అన్నారు. ఇది ఉత్తరకొరియా ప్రజలు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు' అని కొరియన్ మీడియా తెలిపింది.

  ఉత్తరకొరియా కిమ్ రాజభోగాలు, ఇదీ ఆ దేశం సత్తా, అణుయుద్ధం వస్తే మాత్రం...

  వేడుకలు:

  వేడుకలు:

  గత నెల 29న అత్యంత దూరం ప్రయాణించగల ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం హ్వసాంగ్-15)ని పరీక్షించిన నేపథ్యంలో.. దాన్ని పురస్కరించుకుని సదస్సులో వేడుకలు నిర్వహించారు. అంతకుముందు ప్రయోగించిన హ్వసాంగ్-14 కంటే ఇది మరింత దూరం అందుకోవడం విశేషం.

  కిమ్ నిజంగా అంత సాహసం చేశాడా?: ఫోటోలు విడుదల చేసిన ఉ.కొరియా..

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  On Tuesday, the North Korean leader pledged to create more nuclear weapons as he was awarding scientists and officials who have contributed to the construction of the Hwasong-15,
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more