వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉ.కొరియా మాకంటే బెస్ట్, మేం పరిజ్ఞానం ఇవ్వలేదు: పాక్ శాస్త్రవేత్త

ఉత్తర కొరియా దగ్గర ఉన్న అణు సాంకేతికత తమ కంటే శక్తిమంతమైనదని పాకిస్థాన్‌ అణుశాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్‌ ఖాదీర్‌ ఖాన్‌ మంగళవారం తెలిపారు.

|
Google Oneindia TeluguNews

కరాచీ: ఉత్తర కొరియా దగ్గర ఉన్న అణు సాంకేతికత తమ కంటే శక్తిమంతమైనదని పాకిస్థాన్‌ అణుశాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్‌ ఖాదీర్‌ ఖాన్‌ మంగళవారం తెలిపారు.

చదవండి: ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబుపై భారత్ ఆందోళన

ఉత్తర కొరియా హైడ్రోజన్‌ బాంబు పరీక్షలో ఉత్తర కొరియాకు పాకిస్తాన్ ఎలాంటి సాయం చేయలేదని పాక్ అణు బాంబు పితామహుడైన సదరు డాక్టర్ అబ్దుల్ ఖాదీర్ ఖాన్ స్పష్టం చేశారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

చదవండి: అమెరికా మరిన్ని గిఫ్ట్ ప్యాకేజీలు: ఉ.కొరియా, యుద్ధం చేయాలని లేదు కానీ: నిక్కీ

ఉ కొరియా శాస్త్రవేత్తలు అత్యంత సామర్థ్యం కలిగినవారు

ఉ కొరియా శాస్త్రవేత్తలు అత్యంత సామర్థ్యం కలిగినవారు

ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు అత్యంత సామర్థ్యం కలిగిన వారు, వారిలో ఎక్కువ మంది రష్యాలో విద్యనభ్యసించారని ఖాదర్ ఖాన్ తెలిపారు. వారి దగ్గర మా వద్ద కంటే మెరుగైన సాంకేతికత ఉందని చెప్పారు. తమ దగ్గర పాత, సంప్రదాయ టెక్నాలజీ ఉందన్నారు.

పాకిస్తాన్ పాత్ర ఉందా అంటే

పాకిస్తాన్ పాత్ర ఉందా అంటే

ఉత్తర కొరియా అణు ప్రయోగంలో పాకిస్థాన్‌ పాత్ర ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. తమకంటే వారిది అత్యాధునిక టెక్నాలజీ అని అభిప్రాయపడ్డారు.

హైడ్రోజన్ బాంబు నగరాన్నే నాశనం చేస్తుంది

హైడ్రోజన్ బాంబు నగరాన్నే నాశనం చేస్తుంది

హైడ్రోజన్‌ బాంబులు అణుబాంబుల కంటే మరింత శక్తిమంతమైనవని, ఉదాహరణకి అణుబాంబు రెండు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న పరిసరాలను మాత్రమే నాశనం చేస్తుందని, కానీ హైడ్రోజన్‌ బాంబుకు నగరం మొత్తాన్ని నాశనం చేసే శక్తి ఉందని ఖాన్ తెలిపారు.

పాకిస్తాన్ పాత్రపై వివరణ

పాకిస్తాన్ పాత్రపై వివరణ

ఉత్తర కొరియా ఆదివారం అణుపరీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో పాకిస్థాన్‌ హస్తం కూడా ఉందని ప్రపంచ దేశాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ వివరణ ఇచ్చారు.

 పాకిస్తాన్‌దే పాపమని

పాకిస్తాన్‌దే పాపమని

కాగా, భారత్ పై ఉన్న భయంతో తాను క్షిపణి పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలన్న తలంపుతో పాకిస్తాన్.. ఉత్తర కొరియాతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఉత్తర కొరియాకు అవసరమైన అణు పరిజ్ఞానాన్ని సమకూర్చిపెట్టింది. ఇప్పడు ఉత్తర కొరియా ప్రపంచానికే ఒక సవాలుగా మారిందంటే, ఆ పాపం.. అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిన పాకిస్తాన్‌దే అనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Pakistani nuclear scientist Dr Abdul Qadeer Khan on Monday admitted that North Korea's nuclear technology was much better than his country's. He also ruled out any assistance from Islamabad to Pyongyang in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X