వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ కిరాతక చర్యలు: నిద్రపోయారని కాల్చి చంపేశారు, అంకుల్, ఆంటీని వదల్లేదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్:తనకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తీవ్రమైన శిక్షలను విధిస్తాడు. తనను ధిక్కరిస్తే ప్రాణాలు తీయడమే కిమ్ టార్గెట్‌. బంధువులు, తనతో పాటు పనిచేసిన మంత్రలని కూడ చూడకుండా కిమ్ తాను అనుకొన్నది చేస్తాడు.తాను నిర్వహించే సమావేశాల్లో నిద్రపోయారని అనేక మందిని చంపించిన చరిత్ర కిమ్ జంగ్‌కు ఉంది.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌కు వ్యతిరేకంగా పనిచేయాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిందేనని ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు., ఎవరితోనైనా తనకు ఇబ్బందులు వస్తాయని భావిస్తే కూడ కిమ్ జంగ్ ఉన్ వారిని ప్రాణాలతో బతనివ్వరు.

తన సోదరుడు అమెరికా ఏజంట్‌ను కలిశారనే అనుమానంతో కిమ్ జంగ్ అతడిని చంపించారనే ప్రచారం కూడ లేకపోలేదు.అయితే అత్యంత కిరాతకంగా కిమ్ జంగ్ ఉన్ వ్యవహరిస్తాడని గతంలో చోటు చేసుకొన్న ఘటనలను చూస్తే అర్ధమౌతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కిమ్ మీటింగుల్లో నిద్రపోతే చావే గతి

కిమ్ మీటింగుల్లో నిద్రపోతే చావే గతి

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ నిర్వహించే సమావేశాల్లో ఎవరైనా నిద్రపోతే వారికి చావు తప్పదు. ఈ విషయమై గతంలో పలు ఘటనలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. కిమ్‌ ప్రభుత్వంలో ఉన్నత శ్రేణి విద్యాశాఖ అధికారిగా పని చేసిన రియంగ్‌-జిన్‌ 2016 ఆగస్టులో నిర్వహించిన ఓ సమావేశంలో నిద్రపోయాడని హై క్యాలిబర్‌ మిషన్‌ గన్‌తో కాల్చి చంపారు.

రక్షణ మంత్రిని చంపించిన కిమ్

రక్షణ మంత్రిని చంపించిన కిమ్

కిమ్‌ మంత్రివర్గంలో హోంగ్‌ యోంగ్‌ చోయ్‌ రక్షణశాఖ మంత్రిగా పనిచేసేవారు. కిమ్‌ మాట్లాడిన ఓ సమావేశంలో ఆయన నిద్రపోయాడు. ఫలితంగా ఆ మీటింగ్‌లో సూచనలను అమలు చేయలేదు. విషయం తెలుసుకొన్న కిమ్ జంగ్ ఉన్ ఆగ్రహంతో రగిలిపోయాడు. యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌గన్‌తో చోయ్‌ను కాల్చి చంపారు.

అంకుల్‌ను చంపిన కిమ్

అంకుల్‌ను చంపిన కిమ్

కిమ్ జంగ్ ఉన్ ఉత్తరకొరియా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కొంత కాలం వరకు అంకుల్ జనరల్‌ జాంగ్‌ సాంగ్‌ సూచనల మేరకు నడుచుకొన్నాడు. ప్రభుత్వంపై, పార్టీపై పట్టు వచ్చిన తర్వాత సాంగ్ వల్ల భవిష్యత్తులో తనకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని భావించిన కిమ్ జంగ్ ఉన్ అతడిని చంపించాడు. తనకు వ్యతిరేక వర్గాన్ని సాంగ్ పెంచిపోషిస్తున్నాడనే ఆరోపణలతో సాంగ్‌ను చంపించాడు కిమ్. జాంగ్‌ సతీమణి కిమ్‌ క్యోంగ్‌ హుయ్‌ కిమ్‌కు ఆంటీ అవుతారు. తన భర్తను కిమ్‌ హత్యచేశాడని ఆరోపించింది. దీంతో ఆమెపై విషప్రయోగం చేసి హతమార్చాడు కిమ్.

డిప్యూటీ రక్షణ మంత్రిని కాల్చి చంపించిన కిమ్

డిప్యూటీ రక్షణ మంత్రిని కాల్చి చంపించిన కిమ్

కిమ్‌ మంత్రివర్గంలో రక్షణశాఖ ఉపమంత్రిగా కిమ్‌ చోల్‌ పనిచేసేవాడు. కిమ్‌ జొంగ్‌ ఇల్‌ సంతాప కార్యక్రమంలో తాగి గొడవ చేశాడు. దీంతో ఆయన్ను మోర్టార్‌తో కాల్చి చంపించాడు కిమ్. కిమ్‌ మంత్రివర్గంలో డిప్యూటీ ప్రజా భద్రతా మంత్రిగా ఒ సంగ్‌ హోన్‌పనిచేశారు. ఆయన్ను ఫ్లేమ్‌ త్రోవర్‌తో కాల్చి చంపించారని కిమ్‌పై కథనం ప్రచారంలో ఉంది.

అమెరికా ఏజంట్‌ను కలిశాడని సవతి సోదరుడి హత్య

అమెరికా ఏజంట్‌ను కలిశాడని సవతి సోదరుడి హత్య

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో సవతి సోదరుడు కిమ్‌ జొంగ్‌ నామ్‌ను వీఎక్స్‌ విషపదార్థంతో మట్టుబెట్టాడు. హత్యకు గురికావడానికి నాలుగు రోజుల ముందే నామ్‌ ఒక అమెరికా ఏజెంట్‌ను కలిశాడు. ఈ విషయం కిమ్‌ జొంగ్‌కు తెలిసింది.. అంతే నామ్‌ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

English summary
North Korea has executed a vice-premier for showing disrespect during a meeting presided over by leader Kim Jong-un, South Korea said yesterday, after reports that he fell asleep.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X