వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గేదిలేదు: ట్రంప్‌కు కిమ్ షాక్, అణుదాడి చేస్తామని రష్యాకు కిమ్! యుద్ధం తప్పదా?

ఉత్తర కొరియాతో ఎలాగైనా అణ్వాయుధాల అభివృద్ధిని నియంత్రించాలనే ఉద్దేశ్యంతో ఆసియాలోని కీలక దేశాలలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తున్నారు. ఆయనపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/ప్యోంగ్‌యాంగ్: ఉత్తర కొరియాతో ఎలాగైనా అణ్వాయుధాల అభివృద్ధిని నియంత్రించాలనే ఉద్దేశ్యంతో ఆసియాలోని కీలక దేశాలలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తున్నారు. ఆయనపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ట్రంప్‌కు కిమ్ షాక్

ట్రంప్‌కు కిమ్ షాక్

ఎలాగైనా ఉత్తర కొరియా అణ్వాయుధాలను నియంత్రించేలా చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకోసం వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. కానీ ఆయనకు కిమ్ షాకిస్తున్నారు. ఆసియాలో పర్యటిస్తున్న ట్రంప్ యుద్ధాన్ని అడుక్కుంటున్నారని, తమను ఎప్పటికీ భయపెట్టలేరని వ్యాఖ్యానించారు.

అణ్వాయుధాలు నిరోధించలేరు

అణ్వాయుధాలు నిరోధించలేరు

అణ్వాయుధాల అభివృద్ధిని నిరోధించలేరని స్పష్టం చేశారు. ఇక నుంచి అణ్వాయుధాల వేగాన్ని మరింత పెంచుతామని తెలిపారు. తమకు వ్యతిరేకంగా శక్తులను కూడగడుతున్న వ్యక్తిగా, విధ్వంసకుడిగా, కొరియన్ ద్వీపకల్పంలో యుద్ధాన్ని కోరుకుంటున్న వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించారు.

యుద్ధాన్ని అడుక్కుంటున్నారని వ్యాఖ్య

యుద్ధాన్ని అడుక్కుంటున్నారని వ్యాఖ్య

తన పర్యటనతో ఉత్తర కొరియాపై మరింత ఒత్తిడి పెంచాలని ట్రంప్ భావించారు. కానీ కిమ్ మాత్రం అణ్వాయుధాలను మరింత పెంచుతామని చెప్పారు. అంతేకాదు, ట్రంప్ యుద్ధాన్ని అడుక్కుంటున్నారని కిమ్ వ్యాఖ్యానించారు.

కిమ్ కంటే ట్రంప్‌కే ఎక్కువ భయపడుతున్నారు

కిమ్ కంటే ట్రంప్‌కే ఎక్కువ భయపడుతున్నారు

అమెరికా ప్రజలు ఉత్తర కొరియా, కిమ్ జాంగ్ ఉన్ కంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం వల్లే ఎక్కువగా భయపడుతున్నారని ఉత్తర కొరియా వ్యాఖ్యానించింది.

అణుదాడి చేస్తామని హెచ్చరిక

అణుదాడి చేస్తామని హెచ్చరిక

మరోవైపు, అమెరికాపై అణు దాడి చేస్తామని ఉత్తర కొరియా చెబుతోందట. ఈ మేరకు ఓ రష్యా నాయకుడికి ఈ విషయాన్ని చెప్పిందని అంటున్నారు. అమెరికాపై దాడి చేస్తామని చెప్పారని తెలుస్తోంది. అణుదాడికి సిద్ధమని చెప్పారు. అనంతరం ఈ విషయం రష్యా అధ్యక్షులు పుతిన్ ద్వారా వాషింగ్టన్‌కు తెలిసింది.

English summary
After President Donald Trump again escalated his war of words with North Korean leader Kim Jong Un, Pyongyang argued that the U.S. leader's citizens were more concerned about his actions than those of his authoritarian rival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X