వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉ.కొరియా హైడ్రోజన్ బాంబు: బయటపెట్టిన పింక్ లేడీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించిన విషయాన్ని ప్రపంచానికి అందించింది ఓ 74 ఏళ్ళ వయస్సున్న న్యూస్ రీడర్. ప్రపంచాన్ని వణికించే వార్తను ఆమెను చెప్పారు. ఈ వార్తను ప్రసారం చేసే వరకు కూడ ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించిన విషయం ప్రపంచానికి తెలియదు.

ఉత్తరకొరియాలోని టివి ఛానెల్‌లో పనిచేస్తోన్న రీ చున్ హీ... వాయిస్ ఆఫ్ నార్త్ కొరియాగా గుర్తింపు పొందారు. అందరూ ఆమెను అమ్మమ్మగా కూడా పిలుచుకుంటారు. సంప్రదాయ గులాబీ రంగు వస్త్రాలు ధరించి ఆమె చెప్పే వార్తలను ఆసక్తిగా వింటుంటారు.

అమెరికా కట్టడికి కిమ్ ఇలా, ట్రంప్ సహనానికి కారణమిదే! అమెరికా కట్టడికి కిమ్ ఇలా, ట్రంప్ సహనానికి కారణమిదే!

ఖండాంతర క్షిపణి పరీక్షలను మరింత ముందుకు తీసుకెళుతూ, హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించినట్టు ఆమె చదివిన వార్తతోనే ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. ఈ వార్త ప్రసారం కాకపోతే హైడ్రోజన్ బాంబు పరీక్షించిన విషయం తెలియకపోయేది.

North Korea TV’s ‘pink lady’ newsreader behind the chilling nuclear broadcasts

జాతీయ అణ్వాయుధాల కార్యక్రమం చివరి దశకు వచ్చిందని, కొరియన్ సెంట్రల్ టెలివిజన్ లో ఆమె చదివిన వార్తలు ప్రపంచాన్ని వణికించాయి. గడచిన 40 ఏళ్లుగా కొరియా సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తూ వచ్చిన రీ, 1994లో కిమ్ 2 సుంగ్ మరణించిన వేళ, కన్నీరు పెడుతూ, బ్రేకింగ్ న్యూస్ ను చెప్పారు.

సద్దాంకు పట్టిన గతే, కిమ్‌కు హిస్టీరియా: పుతిన్ ఆగ్రహంసద్దాంకు పట్టిన గతే, కిమ్‌కు హిస్టీరియా: పుతిన్ ఆగ్రహం

2012లో ఆమె పదవీ విరమణ తీసుకున్నప్పటికీ, అడపా దడపా ముఖ్యమైన వార్తలను ప్రజలకు అందించాల్సి వచ్చినప్పుడు కొరియా అధికార టెలివిజన్, అమెనే పిలుస్తుంటుంది. అత్యున్నత స్థాయి వార్తలను యువ యాంకర్లతో చెప్పించడం తమ దేశాధినేతకు ఇష్టం లేదని ఉత్తర కొరియా అధికారి ఒకరు తెలిపారు.

ఇక రీ నోటి నుంచి వచ్చిన హైడ్రోజన్ బాంబు ప్రయోగం వార్త స్టాక్ మార్కెట్లను కుదిపేయగా, ట్రంప్ సైతం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

English summary
She called the hydrogen bomb test "a perfect success" and a key step in "completing the state nuclear force”.The granny is considered a national hero who first took to the airwaves in 1971 – leaving a career in acting for the broadcaster Korean Central Television (KCTV).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X