వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుట్టు వీడింది, ఉత్తరకొరియాకు అక్కడ్నించే న్యూక్లియర్ టెక్నాలజీ, కనిపెట్టిన జర్మనీ ఇంటెలిజన్స్!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెర్లిన్: ఉత్తరకొరియా వెనుక ఉన్నదెవరు? అసలు ఆ దేశానికి అంతటి అణుసామర్థ్యం ఎలా వచ్చింది? ఎడాపెడా క్షిపణి ప్రయోగాలు ఎలా జరపగలుగుతోంది? ఏకంగా హైడ్రోజన్ బాంబు‌నే పరీక్షించే స్థాయికి ఎలా చేరింది?

యుద్ధం తప్పదా?: ఆంక్షలు అతిక్రమిస్తూ ఉత్తరకొరియా... డేగకన్నేసిన అమెరికా! ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు..యుద్ధం తప్పదా?: ఆంక్షలు అతిక్రమిస్తూ ఉత్తరకొరియా... డేగకన్నేసిన అమెరికా! ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు..

కొద్దిరోజులుగా అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాల అధినేతల బుర్రలను పట్టిపీడిస్తోన్న ప్రశ్నలివి. రష్యా, చైనాలకు మిత్రదేశమైన ఉత్తరకొరియా నేడు అగ్రరాజ్యం అమెరికానే ఢీ అంటే ఢీ అంటోందంటే.. దాని వెనుక ఎంతమంది చేతులున్నాయి? ఎన్ని మేధస్సుల ఆలోచనలున్నాయి?

చైనాకు ఆగడాలకు చెక్‌, ఆర్మీని వేగంగా తరలించేందుకు సొరంగం, ఇదీ భారత్ ప్లాన్!చైనాకు ఆగడాలకు చెక్‌, ఆర్మీని వేగంగా తరలించేందుకు సొరంగం, ఇదీ భారత్ ప్లాన్!

అయితే తాజాగా జర్మనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ హాన్స్-జార్జ్ మాసెన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాంబు పేల్చారు. జిత్తులమారి ఉత్తరకొరియా 2016, 2017లో బెర్లిన్‌లోని నార్త్ కొరియన్ ఎంబసీ నుంచి అణ్వాయుధ టెక్నాలజీని సంపాదించినట్టు తమ ఇంటెలిజన్స్ ఎజెన్సీ కొన్ని ఆధారాలను సంపాదించిందని ఆయన పేర్కొన్నారు.

ఉ.కొరియా వెనుక చైనా ఉందనుకున్నారు, కానీ...

ఉ.కొరియా వెనుక చైనా ఉందనుకున్నారు, కానీ...

ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ వరుస క్షిపణి పరీక్షలు, హైడ్రోజన్ బాంబు, ఇతర అణ్వస్త్రాల తయారీ వెనుక ఉన్నదెవరన్న ప్రశ్నపై మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ కంట్రీ చైనాయే వెనకుడా ఆ దేశాన్ని నడిపిస్తోందనే అనుమానాలు లేకపోలేదు. కొన్ని నెలల క్రితం అమెరికా రక్షణ పరిశోధకుడు, తూర్పు ఆసియా భద్రత నిపుణుడు గోర్డాన్ చాంగ్ కూడా ఉత్తరకొరియా అణ్వాయుధ సామర్థ్యం వెనుక చైనా ఉందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల కళ్లన్నీ చైనాపైకి మళ్లాయి. మరోవైపు ఉత్తరకొరియా అణ్వాయుధ పాటవం వెనుక మన దాయాది దేశం పాకిస్తాన్‌పై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ అణ్వస్త్రాల తయారీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే క్రమంలో ఉత్తరకొరియాకు తన దగ్గరున్న క్షిపణి పరిజ్ఞానాన్ని అందజేసిందని, ఆ పరిజ్ఞానంతోనే ఉత్తరకొరియా వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందనే అనుమానాలూ వ్యక్తమయ్యాయి.

అగ్నికి ఆజ్యం పోస్తోంది చైనాయే...

అగ్నికి ఆజ్యం పోస్తోంది చైనాయే...

అమెరికా, ఉత్తరకొరియాల నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులును చైనా సొమ్ము చేసుకుంటోందంటూ అమెరికా రక్షణ పరిశోధకుడు, తూర్పు ఆసియా భద్రత నిపుణుడు గోర్డాన్ చాంగ్ ఆ మధ్యన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఉత్తరకొరియాతో దౌత్య సంబంధాలు కొనసాగిస్తోన్న చైనా సమస్యను పరిష్కరించకుండా అగ్నికి ఆజ్యం పోస్తోంది. రెండు దేశాల మధ్య సమస్యను మరింత పెద్దగా చేసేందుకు చైనా చేయాల్సినవన్నీ చేస్తోంది..' అంటూ చాంగ్ దుయ్యబట్టారు. అంతేకాదు, ‘ఉత్తరకొరియాకు అత్యాధునికి సాంకేతిక సామర్థ్యాన్ని చైనాయే అందిస్తోంది. అమెరికాను చేరగల క్షిపణుల తయారీ వెనుక కూడా చైనా హస్తం ఉంది. చైనాయే ఏ పరిస్థితుల్లో అయినా సులభంగా ఉపయోగించగన మొబైల్ లాంఛర్లను ఉత్తరకొరియాకు అందజేసింది.. ఇన్ని రోజులు వాటిని బంకర్లలో దాచిన ఉత్తరకొరియా ఇప్పుడు వాటిని పరీక్షిస్తోంది..' అని గోర్డాన్ చాంగ్ చైనాపై మండిపడ్డారు.

ఉత్తరకొరియా అణ్వాయుధ సామర్థ్యం వెనుక...

ఉత్తరకొరియా అణ్వాయుధ సామర్థ్యం వెనుక...

ఉత్తరకొరియాకు అణ్వస్త్ర, క్షిపణి తయారీ పరిజ్ఞాననం వెనుక దాగి ఉన్న గుట్టును జర్మనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బయటపెట్టింది. అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ఉత్తరకొరియాకు అసలా సాంకేతికత ఎలా వచ్చిందన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. బెర్లిన్‌లో ఉన్న నార్త్‌కొరియా ఎంబసీ నుంచి ఈ టెక్నాలజీని సమకూర్చుకుందని జర్మనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ హాన్స్-జార్జ్ మాసెన్ పేర్కొన్నారు. సేకరించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిసైళ్ల తయారీ కోసం ఉపయోగించుకుంటోందని తెలిపారు.
‘బెర్లిన్ ఎంబసీ నుంచి నార్త్ కొరియా అణ్వాయుధ సాంకేతికతను సేకరించినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిని పౌర అవసరాలకు, మిలటరీ అవసరాల కోసం కూడా ఉపయోగించవచ్చు..' అని మాసెన్ ‌ఎన్డీఆర్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సోమవారం ప్రసారం కానున్న ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ‘మిస్సైల్ టెక్నాలజీని వారు సొంతం చేసుకుంటున్నారని తెలిస్తే ఆపగలిగి ఉండేవాళ్లమని, అయితే ప్రతిసారీ వాళ్ల ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా కష్టమని మాసెన్ అభిప్రాయపడ్డారు.

అమెరికా హెచ్చరికలపై చైనా మండిపాటు...

అమెరికా హెచ్చరికలపై చైనా మండిపాటు...

అణ్వాయుధాల ప్రయోగాల విషయంలో అమెరికా చేసిన హెచ్చరికలను చైనా తప్పుబట్టింది. ప్రచ్ఛన్న యుద్ధం అనే ఆలోచనా విధానాన్ని అమెరికా విడిచి పెట్టాలని డ్రాగన్‌ దేశం హితవు పలికింది. అణ్వాయుధ ప్రయోగాల విషయంలో చైనా పరిమితులు పాటించాలని, ఆసియా ప్రాంతంలో ప్రయోజనాలను పొందేందుకు అణ్వాయుధాలను ప్రయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా రష్యా, చైనాలకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అమెరికా, దాని మిత్ర దేశాలపై ఎటువంటి అణుప్రయోగాలు జరిపినా, అణ్వస్త్రాలు ఉగ్రవాదులకు అందేలా చేసినా సహించబోమని.. అందుకు ఆయా దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని శనివారం యూఎస్‌ హెచ్చరించింది. యూఎస్‌ అణ్వస్త్ర వ్యూహ సమీక్ష(ఎన్‌పీఆర్‌)పై చైనా రక్షణశాఖ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. భద్రతా పరమైన అంశాల కోసం మాత్రమే కొద్దిస్థాయిలో అణ్వస్త్రాలు తయారుచేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రచ్ఛన్న యుద్ధమనే ఆలోచనా విధానం నుంచి యూఎస్‌ బయటకు రావాలని చైనా హితవు పలికింది.

English summary
North Korea has been acquiring technology for its nuclear and weapons programmes through its Berlin embassy, Germany’s head of intelligence says. Hans-Georg Maassen told NDR TV that many of these activities had been thwarted, but not all were detected. He did not say what type of technology was procured, but said it could be used for civilian and military purposes.North Korea has continued to develop missiles and nuclear weapons in defiance of international sanctions.“We have noticed that so many procurement activities have taken place from the embassy,” said Mr Maassen, in an interview due to be broadcast on Monday. “From our point of view, they were for the missile programme but also partly for the nuclear programme,” he added. “When we see such things, we stop them. But we cannot guarantee that we spot and block each attempt.” North Korea has not yet responded to Mr Maassen’s comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X