వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాతోనే అమెరికాకు అణు ముప్పు, ప్రపంచంపై ప్రభావం: కిమ్ షాకింగ్ కామెంట్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా మరోసారి అమెరికాకు సవాల్ విసిరింది.తమ దేశంతో అమెరికాకు అణు ముప్పు ఉందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తేల్చేశారు..ఈ ప్రకటనతో మరోసారి అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అదంతా తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టేందుకే, ప్రతీకారచర్యలు తప్పవు: కిమ్అదంతా తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టేందుకే, ప్రతీకారచర్యలు తప్పవు: కిమ్

ఉత్తరకొరియా కొంత కాలంగా స్ధబ్దుగా ఉంది. అయితే ఆ సమయంలో కిమ్ జంగ్ ఉన్ ఆరోగ్యంపై రకరకాలుగా ప్రచారం సాగింది.కానీ, కిమ్ మరోసారి మీడియాలో కన్పించారు.

షాక్: 'వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్ ' దాడి వెనుక కిమ్: అమెరికాషాక్: 'వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్ ' దాడి వెనుక కిమ్: అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరహలోనే భారీ ట్రక్కును నడుపుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. అంతేకాదు భారీ పర్వతాన్ని కూడ అధిరోహించాడు. ఆ తర్వాత అమెరికాకు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

అమెరికాతో చర్చలకు ఉ.కొరియా సై: అగ్రరాజ్యం మెలిక, చొరవ చూపిన రష్యాఅమెరికాతో చర్చలకు ఉ.కొరియా సై: అగ్రరాజ్యం మెలిక, చొరవ చూపిన రష్యా

అమెరికాకు మాతోనే ముప్పు

అమెరికాకు మాతోనే ముప్పు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అమెరికాకు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరకొరియా అణుశక్తిలో ఏ దేశానికి తక్కువ స్థాయిలో లేదని తేల్చి చెప్పారు. అణుశక్తిలో ఉత్తరకొరియా అమెరికాను ఢీకొట్టే స్థాయికి చేరుకొందని ఆయన అభిప్రాయపడ్డారు.ఉత్తరకొరియాతోనే అమెరికాకు అణు ముప్పు ఉందని కిమ్ తేల్చి చెప్పేశారు.

పార్టీ మీటింగ్‌లో కిమ్ సంచలన వ్యాఖ్యలు

పార్టీ మీటింగ్‌లో కిమ్ సంచలన వ్యాఖ్యలు

శుక్రవారం నాడు పార్టీ నేతల సమావేశంలో కిమ్ జంగ్ ఉన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అణు శక్తిలో అమెరికాకు ధీటుగా ఉత్తరకొరియా ఎదిగిందని కిమ్ వ్యాఖ్యానించారు.ఉత్తరకొరియా అణు శక్తి పరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచ రాజకీయ వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని కిమ్ పార్టీ నేతల సమావేశంలో చెప్పారు.

 ఎవరూ అడ్డుకోలేరు

ఎవరూ అడ్డుకోలేరు

అమెరికాతో సమానంగా అణు శక్తిలో ఉత్తరకొరియా ఎదగడాన్ని ఎవరూ కూడ అడ్డుకోలేరని కిమ్ అభిప్రాయపడ్డారు. అయితే ఉత్తరకొరియా అణుశక్తిలో ధీటుగా ఎదగడం అమెరికాకు తీవ్ర నష్టమని ఆయన ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం అమెరికాకు ఉత్తరకొరియాతోనే అణు ముప్పు సంభవిస్తోందని ఆయన తేల్చి చెప్పారు.

 ఉత్తరకొరియాపై ఆంక్షలు

ఉత్తరకొరియాపై ఆంక్షలు

ఉత్తరకొరియా చమురు దిగుమతులపై మరిన్ని ఆంక్షలు పెట్టేందుకు ఐక్యరాజ్యసమితిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది.ఈ తీర్మానంపై ఐరాస నేడు ఓటింగ్‌ నిర్వహించనుంది. ఒకవేళ ఇది ఆమోదం పొందితే.. అమెరికా, ఉత్తరకొరియా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోలేదు.

English summary
KIM Jong-un has declared that North Korea’s nuclear capabilities now pose a “substantial threat” to the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X