• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిమ్ జాంగ్ యుద్ధసైరన్, విధ్వంస దృశ్యాలు.. సైన్యానికి సోదరి ఆదేశం.. డెత్ మిస్టరీపై మళ్లీ చర్చ..

|

''మన సుప్రీం లీడర్‌ కిమ్ జాంగ్ ఉన్, పార్టీ హైకమాండ్ ఇంకా ప్రభుత్వం కలిసి నాకు కట్టబెట్టిన అధికారాలను అనుసరిస్తూ ఈ ప్రకటన చేస్తున్నాను.. శత్రుదేశాన్ని ఇక ఏమాత్రం ఉపేక్షించకూడాదనే నిర్ణయానికి వచ్చాం. సౌత్ కొరియాపై సైనిక చర్యలకు సిద్ధంగా ఉండాలని మన సైన్యానికి ఆదేశాలిచ్చాను. నార్త్-సౌత్ బంధానికి వేదికగా నిలిచిన పనికిరాని కట్టడాలు పూర్తిగా విధ్వంసమయ్యే దృశ్యాలను త్వరలోనే చూడబోతున్నారు..'' అంటూ మరో సంచలన ప్రకటన చేశారు కిమ్ జాంగ్ ఉన్ చెల్లెలు, వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా ప్రత్యామ్నాయ పొలిట్‌ సభ్యురాలు కిమ్ యో జాంగ్.

కిమ్ జాంగ్‌తో నారా లోకేశ్ మంతనాలు.. చంద్రబాబును ఉతికినా జగన్‌కు షాక్.. ఇదేందంటూ విజయసాయి పంచ్..

ఆగని బెలూన్ల వర్షం..

ఆగని బెలూన్ల వర్షం..

కిమ్ జాంగ్ ఉన్ నియంతృత్వంలో నలిగిపోతోన్న ప్రజల్ని విముక్తి చేస్తామంటూ ‘‘ఫ్రీ నార్త్ కొరియా'' పేరుతో హక్కుల కార్యకర్తలు చేపట్టిన ఉద్యమం.. ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య యుద్ధానికి దారితీసింది. కిమ్ కర్కోటకుడని, అణుబాంబులతో ఆడుకుంటున్నాడని, అతనిపై జనం తిరగబడాలంటూ రాసున్న కరపత్రాలు లక్షలకొద్దీ ఉత్తరకొరియాలోకి వచ్చిపడుతున్నాయి. 10 రోజుల కిందట బెలూన్ల రాక మొదలైననాడే కిమ్ యో హెచ్చరికలు జారీచేశారు. కానీ శనివారం నాటికి కూడా బెలూన్ల వర్షం ఆగకపోవడంతో ఇప్పుడామె అనూహ్య రీతిలో సైనిక చర్యకు పిలుపునిచ్చారు.

ఇదే సరైన సమయం..

ఇదే సరైన సమయం..

బెలూన్ కరపత్రాల ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న ఉత్తర కొరియా.. ఇప్పటికే సౌత్ కొరియాతో దాదాపు అన్ని సంబంధాలు తెంచుకుంది. హాట్ లైన్ సంభాషణలను కూడా నిలిపేసింది. ఇప్పుడు కిమ్ యో జాంగ్ మరో అడుగుముందుకువేసి.. దక్షిణ కొరియాతో సంబంధాలు పూర్తిగా తెంచుకోడానికి ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. ఉత్తరకొరియా అధికారిక మీడియా ప్రచురించిన కథనంలో.. సౌత్ కు బుద్ది చెప్పే బాధ్యతల్ని తనకు సుప్రీం లీడరే కట్టబెట్టారని, అందుకు పార్టీ, ప్రభుత్వం సైతం అంగీకరించాయని ఆమెనే స్వయంగా చెప్పుకోవడం గమనార్హం.

మొదటి టార్గెట్ కాయ్‌సాంగ్..

మొదటి టార్గెట్ కాయ్‌సాంగ్..

సౌత్ కొరియాపై సైనిక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆర్మీ జనరల్ కు ఆదేశాలిచ్చానన్న కిమ్ యో జాంగ్.. తన మొదటి టార్గెట్ ను కూడా స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. సరిహద్దులోని కాయ్‌సాంగ్ సిటీనే ముందుగా ధ్వంసం చేస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాల మధ్య శాంతి కొనసాగేలా.. నిరంతరం సంప్రదింపులు, చర్చల కోసం ఏర్పాటైన ఉమ్మడి కార్యాలయాలు కాయ్ సాంగ్ సిటీలోనే ఉన్నాయి. సదరు కార్యలయాలను పనికిరాని కట్టడాలుగా అభివర్ణించిన కిమ్ యో.. అవి విధ్వంసమయ్యే దృశ్యాలను త్వరలోనే చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.

కిమ్ దేశంపై బెలూన్ బాంబుల వర్షం.. సంకరజాతి కుక్కలంటూ చెల్లెలి ఫైర్.. ఆత్మరక్షణలో సౌత్..

కిమ్ బతికే ఉన్నాడా?

కిమ్ బతికే ఉన్నాడా?

సాధారణంగా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ నిర్వహించే బాధ్యతలన్నీ సోదరి కిమ్ యో జాంగ్ తలకెత్తుకోవడం, విదేశాలకు వార్నింగ్ ఇచ్చే పనిని కూడా ఆమెనే తలకెత్తుకోవడంతో ‘కిమ్ డెత్ మిస్టరీ'పై మళ్లీ చర్చ మొదలైంది. హార్ట్ ఆపరేషన్ వికటించి కిమ్ చనిపోయాడని, నాలుగు వారాల అజ్ఞాతం తర్వాత అతని బాడీ డూప్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చారని పెద్ద ఎత్తున వార్తలు రావడం తెలిసిందే. కిమ్ నిజంగా చనిపోయాడు కాబట్టే పరిపాలనా బాధ్యతల్ని చెల్లెలు చేపట్టిందనే వాదన తెరపైకి వచ్చింది. సుప్రీం కమాండర్ స్థాయిలో ఆమె వరుసగా ఆదేశాలు జారీచేయడాన్ని బట్టి చూస్తూ డెత్ థియరీలో నిజం లేకపోలేదని నార్త్ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు.

సౌత్ శాంతి మంత్రం..

సౌత్ శాంతి మంత్రం..

బెలూన్ల ఉదంతంలో నార్త్ కొరియా తీవ్రస్థాయి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. దాయాది సౌత్ కొరియా మాత్రం ఇప్పటిదాకా శాంతి మంత్రాన్నే పఠిస్తున్నది. కిమ్ కు వ్యతిరేకంగా బెలూన్ల ద్వారా కరపత్రాలు పంపిన ఉద్యమకారులను అరెస్టు చేశామని, అసలు బెలూన్ల ఎగరవేతపైనే పూర్తిగా నిషేధం విధించామని, ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయొద్దని సౌత్ ప్రభుత్వం పలు మార్లు ప్రకటనలు చేసింది. అయితే, బెలూన్ల వర్షం ఎంతకూ ఆగకపోవడం కిమ్ దేశాన్ని మరింతగా రెచ్చగొట్టినట్లయింది.

English summary
Kim Yo Jong, the powerful sister of North Korean leader Kim Jong Un, issued fresh threat to South Korea saying that Pyongyang will will take "action" against the South and order its military to take action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more