• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కన్నీటి పర్యంతమైన కిమ్ జోంగ్ - ఉత్తరకొరియా ప్రజలకు క్షమాపణలు - తొలిసారి బాహుబలి ప్రదర్శన

|

పొద్దున లేచింది మొదలు క్షిపణి ప్రయోగాలు.. ఆటంబాంబుల తయారీ.. అధికారులు, పార్టీ ద్రోహుల ఊచకోతకు ఆదేశాలు.. ఇలా అన్నిటికి అన్నీ కరడుగట్టిన నిర్ణయాలు తీసుకునే ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జోంగ్ ఉన్ మొట్టమొదటిసారి కన్నీటి పర్యంతమయ్యారు.. తనను క్షమించాలంటూ ఉత్తరకొరియా ప్రజలను వేడుకున్నారు.. అనూహ్యమైన ఈ దృశ్యాలకు వర్కర్స్ పార్టీ 75వ వార్షికోత్సవ వేడుక సాక్షిగా నిలిచింది..

చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజేచంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే

కిమ్ భావోద్వేగ ప్రసంగం..

కిమ్ భావోద్వేగ ప్రసంగం..

ఉత్తరకొరియాలో వర్కర్స్ పార్టీ ఏర్పాటై 75 సంత్సరాలు పూర్తైన సందర్భంగా కిమ్ ప్రభుత్వం భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా శనివారం రాత్రి భారీ సైనిక కవాతు నిర్వహించారు. ఈ కవాతులో సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ సైతం పాల్గొన్నారు. అనంతరం వేల మంది సైనికులు, ప్రజలను ఉద్దేశించి పరేడ్ స్పీచ్ లో మాట్లాడుతూ కిమ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దానికి సంబంధించిన వీడియోలను ఉత్తరకొరియా అధికారిక మీడియా విడుదలు చేసింది. కిమ్ ఏడుస్తూ, ప్రజలకు క్షమాపణ చెప్పిన దృశ్యాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

హాథ్రస్ కేసులో మరో ట్విస్ట్: నక్సల్స్ ప్రమేయం - హైకోర్టుకు బాధిత కుటుంబం - సీబీఐ ఎఫ్ఐఆర్ హాథ్రస్ కేసులో మరో ట్విస్ట్: నక్సల్స్ ప్రమేయం - హైకోర్టుకు బాధిత కుటుంబం - సీబీఐ ఎఫ్ఐఆర్

మాట నిలబెట్టుకోలేక పోయాను..

మాట నిలబెట్టుకోలేక పోయాను..

‘‘మీరు నాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా తగినంత స్థాయిలో నేను పని చేయలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. దేశ ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కిచే దిశగా నా ప్రయత్నాలు సరిపోలేదు. అందుకుగానూ మీ నుంచి క్షమాపణలు కోరుతున్నాను. దేశ అభ్యున్నతి కోసం అనేక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ అంతర్జాతీయంగా అమెరికా లాంటి దేశాలు విధించిన ఆక్షలు, కరోనా మహమ్మారి, తుపాను లాంటి వైపరీత్యాలు ఆటంకంగా మారాయి. భవిష్యత్తులోనైనా మనం బలంగా పుంజుకుంటామన్న నమ్మకం ఉంది'' అంటూ కిమ్ కన్నీటి పర్యంతం అయ్యారు. తాము దైవాంశ సంభూతులుగా భావించే కిమ్ కన్నీరు పెట్టుకోవడాన్ని చూసి ఉత్తరకొరియన్లు సైతం ఏడుస్తూ నేతకు జేజేలు పలికారు.

బాహుబలి ప్రదర్శన..

బాహుబలి ప్రదర్శన..

తన పరిపాలనలో లోపాలపై ప్రజలకు క్షమాపణలు చెబుతూనే మరోవైపు తనకు బాగా ఇష్టమైన ఆయుధ సంపత్తిని కిమ్ జోంగ్ ప్రదర్శించడం సంచలనంగా మారింది. ఉత్తర కొరియాలో అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కిమ్ తమ అమ్ములపొదిలోని భారీ ఖండాంతర క్షిపణిని తొలిసారి ప్రదర్శించింది. పాశ్చాత్య దేశాల రక్షణ రంగ నిపుణులు ఈ మిస్సైల్‌ను ‘రాకాసి'గా అభివర్ణించారు. సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల ఆయుధ సంపత్తిని ఉత్తరకొరియా ప్రదర్శించడం గత రెండేళ్లలో ఇదే తొలిసారి. రష్యాకు చెందిన ఆర్-16, ఆర్-26 మిస్సైల్స్ కంటే ఇది శక్తివంతమైనది నిపుణులు చెబుతున్నారు.

  Top News Of The Day : Kim సంచలన ప్రకటన.. China కు ఉత్తర కొరియా మద్దతు!
  కిమ్‌కు జిన్ పింగ్ అభినందన

  కిమ్‌కు జిన్ పింగ్ అభినందన


  ఉత్తరకొరియా వర్కర్స్ పార్టీ 75వ వార్షికోత్సవం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. కొరియా అధినేత కిమ్ జోంగ్ కు అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకుందామంటూ జిన్ పింగ్ తన సందేశాన్ని పంపారు. పరేడ్ డే స్పీచ్ లోనే కిమ్ మరో ఆసక్తికర ప్రకటన చేశారు. ఉత్తరకొరియాలో ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదని, ఇది దేశమంతా గర్వపడాల్సిన గొప్ప విషయమని కిమ్ అన్నారు.
  భారీ మిస్సైల్ వాహనం వెళుతుండగా వాటికి కిమ్ అభివాదం చేస్తోన్న వీడియోలు, భావోద్వేగ ప్రసంగం ఇంర్నెట్ లో వైరల్ గా మారాయి.

  English summary
  Kim Jong-un broke down in tears during his address to North Koreans at a military parade marking the 75th anniversary of the Workers' Party. The North Korean dictator openly wept and sobbed in a rare emotional speech as he spoke to a crowd of tens of thousands of people. CNN's international correspondent Will Ripling noted that the crying leader "indicates what a difficult situation it is right now in North Korea".
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X