వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'20ఏళ్ల కెరీర్‌లో ఇలాంటిది చూడలేదు': ఉ.కొరియా సైనికుడి శరీరం నిండా పురుగులే..

ఆ సైనికుడి శరీరంలోని ప్రతి అవయవ భాగంలోనూ వేల సంఖ్యలో పురుగులు ఉ‍న్నట్లు గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

27సెం.మీ పొడవున్న పురుగు, అతని శరీరం నిండా పురుగులే...అది తినడం వల్లే ? | Oneindia Telugu

సియోల్: ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియాలోకి చొరబడుతున్న ఓ సైనికుడు చొరబాటుకు యత్నించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉత్తరకొరియా సైన్యమే అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. అతను తీవ్ర గాయాలపాలయ్యాడు.

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

గాయాలపాలైన అతన్ని దక్షిణ కొరియా దళాలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి. ఈ సందర్భంగా అతనికి శస్త్ర చికిత్స అందించిన వైద్యులు.. అతని శరీర పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. ఆ సైనికుడి శరీరంలోని ప్రతి అవయవ భాగంలోనూ వేల సంఖ్యలో పురుగులు ఉ‍న్నట్లు గుర్తించారు.

నమ్మలేని నిజాలు?: ప్రపంచానికి తెలియని 'ఉ.కొరియా' ఇది.., అంతా ఆశ్చర్యమే!నమ్మలేని నిజాలు?: ప్రపంచానికి తెలియని 'ఉ.కొరియా' ఇది.., అంతా ఆశ్చర్యమే!

 20ఏళ్ల కెరీర్‌లో ఇలాంటిది చూడలేదు:

20ఏళ్ల కెరీర్‌లో ఇలాంటిది చూడలేదు:

తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇంతటి దారుణమైన కేసును డీల్‌ చేయలేదని సైనికుడికి శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అతని ఉదర భాగంలోని అవయవాల నుంచి 27సెం.మీ పొడవున్న పురుగును వెలికితీసినట్టు చెప్పారు.

కారణమదే:

కారణమదే:

ఆ సైనికుడి చిన్న పేగులో అయిత కొన్ని వందల కొద్ది గుండ్రని పురుగులు ఉన్నాయన్నారు వైద్యులు. ప్రస్తుతం సైనికుడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.

కాగా, ఉత్తరకొరియా వ్యవసాయంలో 'నైట్ సాయిల్'గా పిలిచే మానవ మలాన్నే ప్రధాన ఎరువుగా వాడుతారు. ఆ కూరగాయలను తినడం వల్లే అతని శరీరంలో పురుగులు తయారైనట్టు వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో కొన్ని ప్రాణాంతకమైనవని, మరికొన్నింటివల్ల పెద్ద ప్రమాదమేమి ఉండదంటున్నారు.

 ఆధునిక వైద్యం అక్కడ లేదు:

ఆధునిక వైద్యం అక్కడ లేదు:

ఉత్తరకొరియాలో ఇప్పటికీ ఆధునిక వైద్య పద్దతులు అందుబాటులో లేవు. ఫలితంగా చాలామంది అక్కడ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారన్న వాదన కూడా ఉంది. నిపుణులైన వైద్యులు లేకపోవడం.. ఇంకా పాత కాలం నాటి వైద్య పరికరాలే ఉపయోగిస్తుండటంతో ఉత్తరకొరియాలో వైద్య సేవలు ఇంకా పురోగతి సాధించలేకపోయాయి.

 ఇలాంటి కేసులు ఎక్కువే:

ఇలాంటి కేసులు ఎక్కువే:

ఉత్తరకొరియాలో చాలామందిక్రానిక్ హెపటైటిస్ బి, క్రానిక్ హెపటైటిస్ సి, పారాసైట్స్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నట్టు దక్షిణ కొరియా వైద్య పరిశోధకులు గతంలో గుర్తించారు. 2006-14మధ్య కాలంలో వారు ఉత్తరకొరియాను సందర్శించిన సందర్భంగా ఇలాంటి కేసులను చాలావరకు గుర్తించినట్టు తెలిపారు.

English summary
A North Korean soldier who was shot while fleeing across the border has an extremely high level of parasites in his intestines, his doctors say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X