వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: అమెరికా-దక్షిణ కొరియా యుద్ధవ్యూహాలను తస్కరించిన ఉత్తరకొరియా!?

దక్షిణ కొరియా-అమెరికా ద్వయానికి ఉత్తరకొరియా షాక్ ఇచ్చింది. యుద్ధం వస్తే ఆచరణలో పెట్టేందుకు అవి సిద్ధం చేసుకున్న వ్యూహాల సమాచారాన్ని ఉత్తరకొరియా తస్కరించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సియోల్‌ : దక్షిణ కొరియా-అమెరికా మిత్రద్వయానికి ఉత్తరకొరియా షాక్ ఇచ్చింది. యుద్ధం వస్తే ఆచరణలో పెట్టేందుకు అవి సిద్ధం చేసుకున్న వ్యూహాల సమాచారాన్ని ఉత్తరకొరియా తస్కరించింది.

గత నెలలో దక్షిణ కొరియా మిలటరీ నెట్‌వర్క్‌పై సైబర్‌ దాడికి పాల్పడిన ఉత్తరకొరియా హ్యాకర్లు 235 గిగాబైట్ల(జీబీ) సమాచారాన్ని చోరీ చేశారు. దక్షిణ కొరియా అధికార డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన రీ చీయోల్‌ హీ అనే ప్రజా ప్రతినిధి మంగళవారం ఓ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

North Korean hackers stole US-South Korea war plans, official says

అమెరికా, ఉత్తరకొరియాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. తస్కరింపబడిన సమాచారం ఏమిటన్నది ఇంకా పూర్తిగా గుర్తించలేదని రీ చెప్పారు.

కిమ్‌ తలనరికేందుకు రంగంలోకి దించనున్న స్పెషల్‌ టీం, దక్షిణ కొరియా స్పెషల్‌ ఫోర్సెస్‌, అమెరికాతో సంబంధాలు, అమెరికాతో మిలటరీ డ్రిల్స్‌, పవర్‌ ప్లాంట్లు, కీలక మిలటరీ స్థావరాలు.. ఇలా దక్షిణ కొరియాకు చెందిన కీలక సమాచారం ఉత్తరకొరియా చేతిలోకి వెళ్లినట్లు సమాచారం.

దక్షిణ కొరియా వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ఉత్తరకొరియాలో 6,800 మంది సైబర్‌ హ్యాకర్లు ఉన్నారు. గతంలో ఉత్తరకొరియా హ్యాకర్లు సోనీ పిక్చర్స్‌పై కూడా హ్యాకింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే.

English summary
North Korean hackers allegedly stole classified military documents from a South Korean Defense Ministry database in September 2016, according to Rhee Cheol-hee, a member of South Korea's National Assembly. Rhee, who belongs to the ruling Democratic Party and sits on the Defense Committee, told CNN on Tuesday that he received information about the alleged hacking from the Defense Ministry. He said the documents stolen included the South Korea-US wartime operational plan and a document that includes procedures to "decapitate" the North Korean leadership. About 235 gigabytes worth of military data was stolen by the hackers, Rhee said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X