వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఐఏ కస్టడీలో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ అన్నకొడుకు- చావుభయంతో పారిపోయి చిక్కిన వైనం..

|
Google Oneindia TeluguNews

2017లో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తనకు పోటీగా ఉన్న అన్న కుటుంబాన్ని మట్టుపెట్టిన సమయంలో పారిపోయిన అన్న కొడుకు తాజాగా అమెరికా నిఘా సంస్ధ సీఐఏకు చిక్కినట్లు తెలుస్తోంది. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అన్న కిమ్‌ జోంగ్‌ నామ్‌ను మలేషియా విమానాశ్రయంలో ఇద్దరు మహిళల విషప్రయోగంతో చంపాడు. ఆ ఘటన తర్వాత అతని కుమారుడు కిమ్‌ హాన్-సోల్, ఇతర కుటుంబ సభ్యులు తలోదిక్కుకు పారిపోయారు. అలా దేశదేశాలు తిరుగుతూ సోల్‌ అమెరికా నిఘా సంస్ధ అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో వారు ప్రస్తుతం వారి అదుపులోనే అతన్ని ఉంచారు.

సొంత అన్ననే చంపేసిన కిమ్‌..

సొంత అన్ననే చంపేసిన కిమ్‌..


2017 ఫిబ్రవరిలో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అన్న కిమ్ జోంగ్-నామ్ మలేషియాలోని ఓ రద్దీ విమానాశ్రయంలో జరిగిన దారుణమైన దాడిలో హత్యకు గురయ్యాడు. ఇద్దరు మహిళలు అతన్ని పట్టపగలే విషపూరిత పదార్థాన్ని ప్రయోగించి హత్యచేశారు. ఉత్తర దీంతో ఉత్తర కొరియా ప్రభుత్వంపై అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో అతని భార్య మరియు అతని ఇద్దరు పిల్లల్ని కూడా చంపేస్తారని అంతా భావించారు. కానీ మకావు వెళ్లిన ఈ కుటుంబం ఆ తర్వాత పశ్చిమ దేశాలకు వెళ్లి రాజకీయ ఆశ్రయం పొందాలని భావించింది. కానీ ఒకే చోట ఉంటే చనిపోతామని భావించి వారు తలో దిక్కుకు పారిపోయారు.

పారిపోయిన కిమ్‌ అన్నకొడుకు..

పారిపోయిన కిమ్‌ అన్నకొడుకు..

ఇంటెల్‌ న్యూస్‌ సమాచారం బట్టి చూస్తే కిమ్ జోంగ్-నామ్ పెద్ద కుమారుడు కిమ్ హాన్-సోల్ ఉత్తరకొరియాలో చెయోలిమా-డిఫెన్స్‌గా పిలిచే ఓ తిరుగుబాటు వర్గం సాయం తీసుకున్నాడు. అప్పట్లో కిమ్‌కు వ్యతిరేకంగా గళమెత్తే వారికి వీరు అండగా నిలిచేవారు. అలా కిమ్‌ అన్నకొడుకు కిమ్‌ హాన్‌ సోల్‌కు కూడా వీరు సాయం చేశారు. దీంతో ఆయన దేశం వదిలి పారిపోయాడు. వీరి చెయోలిమా డిఫెన్స్‌ సాయంతో కిమ్‌ కుటుంబం ఉత్తరకొరియా నుంచి తిరుగుబాటు గ్రూపుల సాయంతో పశ్చిమదేశాలకు పారిపోయింది. వీరితో పాటు కిమ్‌ హాన్‌ సోల్‌ కూడా ఉన్నాడు. అప్పట్లో కిమ్‌ సర్కారు ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ ఎవరికీ దొరకలేదు.

న్యూయార్స్‌ మ్యాగజైన్‌ కథనంతో...

న్యూయార్స్‌ మ్యాగజైన్‌ కథనంతో...

అప్పట్లో చిన్నాన్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భయంతో దేశం వదిలి పారిపోయిన కిమ్‌ హాన్‌ సోల్‌ కుటుంబం యూరప్‌ వెళ్లిపోగా.. కిమ్‌ హాన్‌ సోల్‌ మాత్రం తైవాన్‌కు వెళ్లాడు. అక్కడ చెయోలిమా సివిల్‌ డిఫెన్స్‌ సభ్యులు ఆయనకు భద్రత కల్పించారు. అక్కడి నుంచి కిమ్ హాన్‌ సోల్‌ ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లగా అక్కడ కాపు కాసిన సీఐఏ అధికారులు ఆయన్ను నిర్బంధించారు. అక్కడి నుంచి అతన్ని అమెరికా తరలించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన సీఐఏ అదుపులోనే ఉన్నట్లు సమాచారం. కిమ్‌తో సంబంధాల నేపథ్యంలో అమెరికా అతని అన్న కొడుకును అప్పగిస్తుందా లేక విచారణ జరుపుతుందా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు కిమ్‌ హాన్‌ సోల్‌ తల్లి, సోదరి ఆచూకీ కూడా తెలియరాలేదు. మకావులో కిమ్‌ హాన్‌ సోల్‌ నిర్వహించిన ఉత్తరకొరియా స్లష్‌ ఫండ్‌కు సంబంధించి సీఐఏ ఆయన్ను విచారించే అవకాశముంది.

English summary
the half nephew of north korean leader Kim Jong-un, who disappeared in 2017 and has not been seen since, is in the custody of the United States Central Intelligence Agency (CIA), according to a new report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X