వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kim Jong Un:చైనాకు మద్దతు ప్రకటించిన ఉత్తరకొరియా నియంత.. అందుకేనా..!

|
Google Oneindia TeluguNews

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చైనాకు అన్ని విషయాల్లో మద్దతు ఇస్తానంటూ తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 71 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న జిన్‌పింగ్‌కు లేఖ రాస్తూ.. కొరియా ప్రజలు తన పార్టీ ఎప్పటికీ చైనాకు, చైనా ప్రజలకు మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు అండగా ఉంటుందని నియంత కిమ్ జాంగ్ ఉన్ తెలిపారు. సోషలిజం నెలకొల్పే క్రమంలో చైనా ప్రజలు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ, కార్యకర్తలు తమ రక్తాన్ని చిందించారని లేఖలో గుర్తుచేశారు కిమ్.

చైనా దేశం ఆవిర్భవించిన తర్వాత 71 ఏళ్లుగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నేపథ్యంలో ఎన్నో విజయాలను నమోదు చేసిందని కిమ్ ప్రశంసించారు. అమెరికా చైనా దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి కిమ్ అండగా ఉంటానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు కొరియా కూడా అమెరికాతో మొదటి నుంచి విబేధిస్తూ వస్తోంది. కొన్ని దేశాలు చైనాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, జింగ్‌పింగ్‌పై తప్పుడు ప్రచారాలు చేసి చైనా ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయని లేఖలో కిమ్ పేర్కొన్నారు. అలాంటి ప్రయత్నాలతో పప్పులేమీ ఉడకవని.. వెంటనే ఆ కుటిల ప్రయత్నాలను మానుకోవాలని కిమ్ లేఖలో కోరారు.

North Korean President Kim Jong Un extends support to China to corner US

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా జనరల్ సెక్రటరీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి అడుగులో అడుగు వేస్తానని కిమ్ చెప్పారు. భవిష్యత్తులో చైనా- ఉత్తరకొరియా దేశాలు చరిత్ర సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఇక కిమ్ జాంగ్ ఉన్ రాసిన లేఖ ప్రస్తుతం ప్రపంచ అగ్రదేశాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కిమ్ చైనాకు మద్దతు ఇస్తానని తెలపడంపై కేవలం అమెరికాను టార్గెట్ చేసేందుకే అని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా చైనా దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో చైనాకు తన మద్దతును తెలిపి కిమ్ స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే అమెరికా ఉత్తరకొరియా దేశాల మధ్య రెండు సార్లు చర్చలు జరిగినప్పటికీ రెండూ ఎలాంటి ఫలితాలన్ని ఇవ్వలేదు. దీంతో ఇటు అమెరికా, అటు దక్షిణ కొరియా మధ్య కూడా చెప్పుకోదగ్గ సంబంధాలు లేవు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్ష్య ఎన్నికల్లో బిజీగా మారడంతో కిమ్ పై దృష్టి సారించడం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
North Korean President Kim Jong UN praised China and said that Korea would always stand by Jinping and support him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X