వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉ.కొరియా దారుణం: ద. కొరియా వైపు వెళ్లబోయాడని సొంత సైనికుడిపై 40 రౌండ్ల కాల్పులు

ఉత్తర కొరియాలో దారుణమైన పాలన మరోసారి రుజువైంది. పొరుగు దేశం వైపు వెళ్తున్నాడని సొంత దేశానికి చెందిన సైనికుడినే కాల్చి చంపబోయిన సంఘటన చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్: ఉత్తర కొరియాలో దారుణమైన పాలన మరోసారి రుజువైంది. పొరుగు దేశం వైపు వెళ్తున్నాడని సొంత దేశానికి చెందిన సైనికుడినే కాల్చి చంపబోయిన సంఘటన చోటు చేసుకుంది.

సొంత సైనికుడిపై తుపాకీ గుళ్ల వర్షం

సొంత సైనికుడిపై తుపాకీ గుళ్ల వర్షం

ఉత్తర కొరియాకు చెందిన ఓ సైనికుడు దక్షిణ కొరియా సరిహద్దు వైపుకు వెళ్లబోయాడు. ఆ సమయంలో అతనిని సొంత సైన్యం దారుణంగా చంపేందుకు ప్రయత్నించింది. ఆ సైనికుడిపై తోటి సైనికులే తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు.

40 రౌండ్ల కాల్పులు జరిపారు

40 రౌండ్ల కాల్పులు జరిపారు

ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సరిహద్దులోని ఓ గ్రామం వద్ద ఓ సైనికుడు తన వాహనంలో దక్షిణ కొరియా వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసిన సమయంలో ఇది చోటు చేసుకుంది. అతనిపై దాదాపు నలభై రౌండ్ల కాల్పులు జరిపారు.

అతని పరిస్థితి విషమంగానే ఉంది

అతని పరిస్థితి విషమంగానే ఉంది


దీనిని గమనించిన యునైటెడ్ నేషన్స్ కమాండ్ సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. శరీరంలోకు ఆరు బుల్లెట్లు వెళ్లాయి. అతని పరిస్థితి విషమంగానే ఉంది.

తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో పర్యాటకులు ఎక్కువగా ఉంటారు. కానీ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ కాల్పులపై దక్షిణ కొరియా స్పందిస్తూ.. తమ సైనికులు గాయపడలేదని చెప్పారు.

English summary
A North Korean soldier is critical after he was shot while defecting to the South on Monday. He is undergoing surgical procedures, the South Korean government said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X