వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుఎస్ వైమానిక దాడులు: 17 మంది పౌరులు బలి

|
Google Oneindia TeluguNews

సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను అంతం చెయ్యడానికి అమెరికా వైమానిక దాడులు చేస్తున్నది. శుక్రవారం ఉత్తర సిరిమాలో అమెరికా వైమానిక దాడులు జరపడంతో 17 మంది మరణించారు. ఈ వైమానిక దాడులలో 40 మందికి పైగా స్థానిక పౌరులు గాయపడి చికిత్స పోందుతున్నారని మానవహక్కుల పరిశీలకులు అంటున్నారు.

ఉత్తర సిరియా లోని అలెప్పో ప్రావెన్స్ ప్రాంతంలోని బెరిమ్హూరి గ్రామంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మాటు వేశారని అమెరికా బలగాలు పసిగట్టాయి. శుక్రవారం ఒక్క సారిగా అమెరికా బలగాలు వైమానిక దాడులకు దిగడంతో ఉగ్రవాదులు హడలిపోయారు.

Northern Syria Coalition Airstrike Killed At Least 17 Civilians

తీవ్రవాదులు ప్రతిదాడులకు దిగే లోపు 17 మంది పౌరులు మరణించారు. గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీశారు. ఈ దాడులలో 40 మందికి పైగా తీవ్రవాగాయాలై వివిద ఆసుపత్రులలో చికిత్స పోందుతున్నారని సిరియా లోని మానవహక్కుల పరిశీలకులు శనివారం వెళ్లడించారు.

అమెరికా దాడులలో 17 మంది పౌరులు మరణించారని సిరియాలోని మీడియా వెళ్లడించింది. అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ను వదిలి పెట్టమని ఇప్పటికే అమెరికా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం జరిగిన వైమానిక దాడులలో ఎంత మంది తీవ్రవాదులుమరణించారు అని ఇంకా స్పష్టం కాలేదని మానవహక్కుల పరిశీలకులు అంటున్నారు.

English summary
At least 17 civilians were killed and over 40 others wounded on Friday in the airstrikes by the US-led anti-terror coalition on a village in northern Syria, Syrian Observatory for Human Rights reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X