వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సంతతి మహిళ షాన పాండ్యా అంతరిక్షంలోకి వెళ్లడం లేదు

భారత సంతతికి చెందిన డాక్టర్ షాన పాండ్యా (32) అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీని పైన స్వయంగా పాండ్యా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన డాక్టర్ షాన పాండ్యా (32) అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని స్వయంగా పాండ్యా ఖండించారు. తాను కెనెడియన్ స్పేస్ ఏజెన్సీస్ లేదా నాసాతో అఫిలియేట్ అయి లేనని స్పష్టం చేశారు. తాను నాసా మిషన్‌కు ఎంపిక కాలేదని చెప్పారు.

కాగా, భారత సంతతికి చెందిన వ్యోమగాములు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ అంతరిక్షయాత్రలకు వెళ్లి భారత కీర్తిని ఇనుమడింపజేసిన విషయం తెలిసిందే. త్వరలో షానా పాండ్యా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని ఆమె ఇప్పుడు ఖండించారు.

<strong>చావ్లా, సునీత బాటలో: నింగిలోకి భారత సంతతి మహిళ షాన పాండ్య </strong>చావ్లా, సునీత బాటలో: నింగిలోకి భారత సంతతి మహిళ షాన పాండ్య

డాక్టర్‌ షాన పాండ్య (32) ప్రస్తుతం కెనడాలోని ఆల్బెర్టా యూనివర్శిటీ హస్పిటల్‌లో జనరల్‌ ఫిజిషియన్‌గా పని చేస్తున్నారు. సిటిజన్‌ సైన్స్‌ ఆస్ట్రోనాట్‌ (సీఎస్‌ఏ) ప్రోగ్రాం కోసం 3,200 మంది నమోదు చేసుకోగా ఇద్దరిని మాత్రమే ఎంపిక చేశారు.

 Not chosen for NASA space mission: Indian-origin astronaut

ఆ ఇద్దరిలో పాండ్య ఒకరు అని వార్తలు వచ్చాయి. 2018లో ఎనిమిది మంది వ్యోమగాములతో కలిసి ఈమె కూడా అంతరిక్షయాత్రకు వెళ్లనున్నట్లు వచ్చింది.

కాగా, ఇటీవలే పాండ్య.. ముంబై నగరంలోని సొంత ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మిషన్‌లో భాగంగా బయో మెడిసిన్‌, మెడికల్‌ సైన్స్‌లో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.

'పోలార్‌ సబ్‌ఆర్బిటల్‌ సైన్స్‌ ఇన్‌ ది అప్పర్‌ మెసోస్పియర్‌' ప్రాజెక్టులో భాగంగా వాతావారణ మార్పుల ప్రభావంతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని పాండ్య వివరించారు.

English summary
Shawna Pandya, an Indian-origin astronaut in Canada, has denied news reports claiming NASA had shortlisted her for its 2018 space mission. Pandya further clarified that she was neither a neurosurgeon nor an opera singer, adding that she wasn't affiliated with the Canadian Space Agency or NASA. Earlier, it was widely reported she would become the third Indian-origin woman in space.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X