వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాను అలా తిట్టడం తప్పు - ట్రంప్‌ ‘కంపు’పై బైడెన్ ఫైర్ - మాస్క్ మ్యాటర్స్ -హత్యకు కుట్ర

|
Google Oneindia TeluguNews

''ఇండియాను చూడండి.. అక్కడి గాలి ఎంత మురికిగా ఉంటుందో.. ఇండియా లాంటి దేశాలు పర్యావరణానికి హాని చేస్తూ పోతుంటే.. దానిని కాపాడాల్సిన బాధ్యత అమెరికా నెత్తికెత్తుకోవాలా? మన ఖజానాకు గండిపెట్టేది కాబట్టే ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాను'' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంసిన వ్యాఖ్యలు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

Recommended Video

US election 2020 : Donald Trump's Filthy India Remark ఇండియా మురికి దేశమంటూ ట్రంప్...! || Oneindia

కీలక సమయంలో అమెరికాకు అండగా ఉంటూ, చరిత్రలో మరే భారత ప్రధాని చేయని విధంగా ట్రంప్ తరఫున నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేసినందుకు ఇదా ఫలితం? అని విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి. కాగా,

స్నేహం పరువు తీసిన ట్రంప్ - గోడ కట్టినా 'కంపు ఇండియా' దాగలేదు - 'హౌడీ మోడీ' ఫలితమంటూస్నేహం పరువు తీసిన ట్రంప్ - గోడ కట్టినా 'కంపు ఇండియా' దాగలేదు - 'హౌడీ మోడీ' ఫలితమంటూ

 తిట్టడం తప్పు.. దాందో వచ్చేదేంటి?

తిట్టడం తప్పు.. దాందో వచ్చేదేంటి?

ఇండియా మురికి దేశమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తీవ్రంగా తప్పు పట్టారు. చరిత్ర పొడవునా ఇండియా.. అమెరికాకు మిత్రదేశంగా ఉంటోన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. మిత్రులను ఉద్దేశించి ఇలా మాట్లాడటం ఏ మాత్రం సబబుకాదని చురకవేశారు. ‘‘ఇండియాను మురికి దేశంగా ట్రంప్ అభివర్ణించారు. స్నేహితులను ఉద్దేశించి అనాల్సిన మాటలు కావివి. అయినా, ఇలా అందరినీ నిందిస్తూ పోతే కాలుష్యం తగ్గి, వాతావరణం బాగవుతుందా?'' అని బైడెన్ అన్నారు.

ఇండియాకు అండ..

ఇండియాకు అండ..

వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హ్యారిస్ తోపాటు తాను కూడా ఇండియాకు అండగా ఉంటామని, భారత్ తో భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తామని, ట్రంప్ హయాంలో దెబ్బతిన్న విదేశాంగ విధానాలను సవరించి, మళ్లీ ఇండియా గౌరవాన్ని తిరిగి నిలబెడతామని జో బైడెన్ హామీ ఇచ్చారు. ఇండియన్ అమెరికన్లతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, అమెరికాలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో ట్యూషన్ ఫీజును లక్షా 25వేల డాలర్లలోపే ఉండేలా చర్యలు తీసుకుంటానని, దౌత్య సంబంధాల్లోనూ భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తానంటూ దసరా, దీపావళి సందర్భంగా బైడెన్ సుదీర్ఘ వ్యాసం రాసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో తనకు మద్ధతుగా నిలిచి గెలిపించాల్సిందిగా ఆయన ఇండియన్ అమెరికన్లను కోరారు.

నితీశ్‌కు షాక్- చిరాగ్‌తో బీజేపీ చీకటి ఒప్పందం - సర్వత్రా విమర్శ - జేపీ నడ్డా ఏం చెప్పారంటే..నితీశ్‌కు షాక్- చిరాగ్‌తో బీజేపీ చీకటి ఒప్పందం - సర్వత్రా విమర్శ - జేపీ నడ్డా ఏం చెప్పారంటే..

మాస్క్ మ్యాటర్స్..

మాస్క్ మ్యాటర్స్..

నవంబర్ 3న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రెండు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, రిపబ్లికన్ పార్టీ సభలకు జనం భారీగా హాజరవుతుండటం, వాళ్లలో చాలా మంది మాస్కులు ధరించకపోవడం.. కనీసం అధ్యక్షుడు కూడా మాస్కును వేసుకోకపోవడంతో ట్రంప్ సభలను ‘సూపర్ స్ప్రెడర్స్'(వైరస్ వ్యాప్తి కేంద్రాలు)గా మీడియా అభివర్ణింస్తోంది. దీనిపై బైడెన్ స్పందిస్తూ.. కొవిడ్ నియంత్రణ విషయంలో ట్రంప్ తన వైఫల్యాన్ని పదే పదే చాటుకుంటున్నారు. మొదటి నుంచీ ఆయన తీరు ప్రమాదకరంగానే ఉంది. నిండు జీవితానికి మాస్క్ అవసరమన్న ధ్యాస కూడా ఆయనకు లేదు'' అని బైడెన్ తిట్టిపోశారు.

బైడెన్ హత్యకు కుట్ర?

బైడెన్ హత్యకు కుట్ర?

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోన్న జోబైడెన్ ను అంతం చేసేందుకు భారీ కుట్ర జరిగినట్లు ఆలస్యంగా వెల్లడైంది. నార్త్ కరోలీనాకు చెందిన 19 ఏళ్ల అలెగ్జాండర్ హిల్లెల్ ట్రెయిన్మన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను తీసుకెళుతుండగా అతను పట్టుపట్టాడు. విచారణ సందర్భంగా అలెగ్జాండర్ అనూహ్య విషయాలు బయటపెట్టాడు. సామూహిక విధ్వంసం చేయాలన్న ఉద్దేశంతోనే ఆయుధాలు, పేలుడు పదార్థాలను సమకూర్చుకున్నానని, మే నెలలోనే.. డెలావేర్ లోని బైడెన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించానని, బైడెన్ ను చంపుతానని ఓ స్నేహితుడితో అన్న మాటలను కూడా అలెగ్జాంగర్ అంగీకరించడం సంచలనం రేపింది.

English summary
Former US vice president and Democratic Party’s presidential nominee Joe Biden on Saturday slammed President Donald Trump for his comment on India’s air pollution. Biden said that he and his running mate Kamala Harris deeply value America’s partnership with India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X