వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఆరోపణలు?: రాఫెల్ డీల్‌‌పై తేల్చేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం, డసో ఏవియేషన్

|
Google Oneindia TeluguNews

ప్యారిస్/న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, పరస్పర విమర్శలు చేసుకుంటూ మరింత వేడెక్కిస్తున్నాయి. తాజాగా, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరింత దుమారం రేపాయి.

హోలాండే వ్యాఖ్యలను ఖండించిన ఫ్రాన్స్ ప్రభుత్వం

హోలాండే వ్యాఖ్యలను ఖండించిన ఫ్రాన్స్ ప్రభుత్వం

విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే డసో ఏవియేషన్ సంస్థకు సూచించిందని హోలాండే చెప్పినట్లు ఫ్రెంచి పత్రికి మీడియాపార్ట్ వెల్లడించింది. అయితే, ఈ వార్తలను తాజాగా, ఫ్రాన్స్ ప్రభుత్వం ఖండించింది. ఒప్పందాల్లో భారత సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రెంచి కంపెనీలకు ఉంటుందని స్పష్టం చేశారు.

మా కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఉంది.. భారత్ చెప్పిందని ఒప్పుకోం

మా కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఉంది.. భారత్ చెప్పిందని ఒప్పుకోం


‘భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని మేం కంపెనీలను భాగస్వాములుగా ఎంచుకోం. రాఫెల్ ఒప్పందంలో మా పాత్ర కూడా ఏం లేదు. ఒప్పందాల కోసం సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రాన్స్ కంపెనీలకు ఉంటుంది. ఏ సంస్థకు సామర్థ్యం ఉందని భావిస్తే వాటినే మా కంపెనీలు ఎంచుకుంటాయి. అప్పుడే భారత ప్రభుత్వ అనుమతిని కోరతాము' అని ఫ్రాన్స్ ప్రభుత్వం తేల్చి చేసింది.
భారత చట్టాలకు అనుగుణంగానే ఈ ఒప్పందాలు జరిగాయని ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒప్పందంపై హోలాండే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ మేరకు స్పష్టనిచ్చింది.

హోలాండే వ్యాఖ్యల నేపథ్యంలో..

హోలాండే వ్యాఖ్యల నేపథ్యంలో..


కాగా, రాఫెల్ ఒప్పందంలో డసో ఏవియేషన్ తన భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో హోలాండే వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఒప్పందం కోసం రిలయన్స్ డిఫెన్స్ గ్రూపు పేరును భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని హోలాండే చెప్పినట్లు మీడియాపార్ట్ పేర్కొనడంతో ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మోడీపై ప్రభుత్వం విమర్శల దాడిని రెట్టింపు చేసింది. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ మోడీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సమయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఇచ్చిన స్పష్టతతో మరోసారి కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్లయింది.

రిలయన్స్ డిఫెన్ మా ఎంపికే.. తేల్చేసిన ఫ్రాన్స్ కంపెనీ..

రిలయన్స్ డిఫెన్ మా ఎంపికే.. తేల్చేసిన ఫ్రాన్స్ కంపెనీ..

ఇది ఇలాఉంటే, హోలాండే చేసిన వ్యాఖ్యలను డసో ఏవియేషన్ కూడా ఖండించింది. రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంచుకోవడం పూర్తిగా తమ నిర్ణయమేనని స్పష్టం చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. ‘రాఫెల్ ఒప్పందం కోసం మేం రిలయన్స్‌ను ఎంచుకున్నాం. ఇది మా నిర్ణయమే. మా నిర్ణయంతోనే మేం కొనసాగుతాం' అని డసో ఏవియేషన్ సీఈఓ ఎరికి ట్రాపియర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది కూడా కొంత నిరాశ కలిగించే అంశమే.

English summary
The French government Friday said it was in no manner involved in the choice of Indian industrial partners for the Rafale fighter jet deal, asserting that French companies have the full freedom to select Indian firms for the contract.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X