వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపిల్ కు మళ్లీ నిరాశే.. ప్రత్యేక రాయితీలపై తేల్చేసిన కేంద్రం

టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. కొత్త పన్ను విధానం కింద ఐఫోన్‌ తయారీదారైన ఆపిల్‌కు పన్ను, డ్యూటీల పరంగా ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. కొత్త పన్ను విధానం కింద ఐఫోన్‌ తయారీదారైన ఆపిల్‌కు పన్ను, డ్యూటీల పరంగా ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది.

కూపర్టినోకు చెందిన ఐఫోన్‌, ఐప్యాడ్‌ తయారీదారైన ఆపిల్‌ భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు పలు రాయితీలను ఎప్పటినుంచో కోరుతోంది. కస్టమ్‌ డ్యూటీలను తగ్గింపు మాత్రమే కాక, 30 శాతం స్థానిక వనరులనే నియమించుకోవాలనే నిబంధన నుంచి కూడా తమల్ని మినహాయించాలని ఈ టెక్నాలజీ దిగ్గజం అభ్యర్థిస్తోంది.

 Not possible to extend concessions to Apple under GST regime

మేకిన్‌ ఇండియాను ప్రోత్సహిస్తున్నామని, దిగుమతులను కాదని పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌, వాటి భాగాల దిగుమతిపై కస్టమ్‌ డ్యూటీని ఇప్పటికే పెంచినట్టు పేర్కొంది. మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించకుండా దిగుమతులను ప్రోత్సహించేది లేదని కేంద్ర స్పష్టం చేసింది.

ఆపిల్‌కు భారత్‌లో పూర్తిగా తన సొంతమైన స్టోర్‌ లేదు. రెడింగ్టన్, ఇంగ్రామ్ మైక్రో వంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తన ఉత్పత్తులను భారత్‌లో విక్రయిస్తోంది. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా భారత్‌ పేరులోకి రావడంతో, ఆపిల్‌ దృష్టి ప్రస్తుతం భారత్‌పై పడింది.

వ్యయాలను తగ్గించుకోవడానికి స్థానికంగా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. దీనికోసం తమకు కొన్ని రాయితీలు కల్పించాలంటూ ఆపిల్‌ ఎప్పటినుంచో భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. కానీ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో ఎవరికీ కూడా ప్రత్యేక రాయితీలను ఇచ్చేది లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి.

English summary
The government will not be able to extend tax and duty related concessions to iPhone maker Apple under the new indirect tax regime as the effort is to promote Make in India and not imports, an official source said. "We have already hiked customs duty on smartphone and imports of its parts. So, it is clear that we do not want to encourage imports and rather encourage Make in India. "With the Goods and Services Tax (GST) in place, giving separate exemptions to anyone is not possible," the government source said. Cupertino-based iPhone and iPad manufacturer Apple has sought certain concessions for setting up manufacturing unit in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X