వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు ట్రంప్ షాక్: టెర్రరిస్టులపై పోరులో పాక్ మొండిచేయి, హఫీజ్ విడుదలపై అసంతృప్తి

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్‌ పూర్తిగా సహకారం అందించడం లేదంటూ అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచుతున్న హక్కానీ నెట్‌వర్క్‌పై పాకిస్తాన్‌ ఎటువంటి సైనిక చర్య చేపట్టడం లేదని ట్రంప్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోనున్నట్టు అమెరికా ప్రకటించింది. అయితే పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతం ఇస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ సక్రమంగా వ్యవహరించడం లేదని అమెరికా అసహనం వ్యక్తం చేసింది.ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న నెట్‌వర్క్‌లపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోందని అమెరికా అభిప్రాయపడింది.

పాక్ తీరుపై అమెరికా అసంతృప్తి

పాక్ తీరుపై అమెరికా అసంతృప్తి

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదని అమెరికా అభిప్రాయపడింది. పాకిస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలు ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఉన్నాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అభిప్రాయపడింది.

హఫీజ్ సయీద్ విడుదలపై

హఫీజ్ సయీద్ విడుదలపై

ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను పాకిస్తాన్‌ గృహనిర్భంధం నుంచి విడుదల చేసిందని అమెరికా పేర్కొంది. ఈ తరహ ఘటనలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు దోహదపడుతాయని అమెరికా అభిప్రాయపడింది. పాకిస్తాన్‌ కేంద్రంగా హక్కానీ నెట్‌వర్క్‌ ఉగ్రకార్యక్రమాలు నిర్వహిస్తోందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తేల్చి చెప్పింది.

పాక్ చర్యలు సంతృప్తిగా లేవు

పాక్ చర్యలు సంతృప్తిగా లేవు

పాకిస్తాన్‌ తాజాగా తీసుకుంటున్న చర్యలు ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్నట్లు ఉందని ట్రంప్‌ అ‍డ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. ట్రంప్‌ న్యూ సౌత్‌ ఏషియా స్ట్రాటజీలో పాకిస్తాన్‌ భాగమైనా అందుకు అనుగుణంగా ఆ దేశం చర్యలు తీసుకునే అవకాశలు లేవని అమెరికా నిఘా సంస్థలు చెబుతున్నాయి.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి వస్తామని పాకిస్థాన్ చెబుతూనే పరోక్షంగా ఉగ్రవాదులకు సహకరించేలా వ్యవహరిస్తోందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అభిప్రాయపడింది. ఉగ్రవాద వ్యతిరేక పోరులో కలిసివస్తామని ప్రకటించినా పాక్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అమెరికా సూచించింది. ఇదే తరహలో వ్యవహరిస్తే ఉగ్రవాదం మరింత పెట్రేగిపోయే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది.

English summary
America is not satisfied with Pakistan's cooperation in the war against terror as part of its South Asia strategy and yet to see Islamabad taking steps to "rein in" the Taliban and the Haqqani network, a senior Trump administration official has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X