• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫేస్‌బుక్ స్కామ్‌లో మీ డేటా ఉందా?: తెలుసుకునే ఛాన్స్, జుకర్ బర్గ్‌కు 4 ప్రశ్నలు

|

వాషింగ్టన్: ఫేస్‌బుక్ డేటా లీకేజీపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 'కేంబ్రిడ్జి అనలిటికా' ఉదంతం వెలుగుచూడటంతో.. ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అతిపెద్ద కుదుపు?: ట్రంప్ గెలుపుకు ఫేస్‌బుక్‌తో లింకు?, అసలేం జరిగింది?

ఈ నేపథ్యంలో 'కేంబ్రిడ్జి అనలిటికా'లో ఎవరి సమాచారం అయితే షేర్ అయిందో.. దాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది. డేటా లీక్ అయినట్టుగా తెలుస్తున్న 87మిలియన్ల ఫేస్‌బుక్ యూజర్స్ 'న్యూస్ ఫీడ్'లో ఈరోజు నుంచే ఆ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

'ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్'

'ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్'

కేంబ్రిడ్జి అనలిటికా ఉదంతంలో లీకైనా డేటాకు సంబంధించి.. దాదాపు 70శాతం మంది యూజర్స్ ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, యూకె నుంచి ఉన్నట్టు ఫేస్ బుక్ తెలిపింది.

ఇకనుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న2.2బిలియన్ల ఫేస్‌బుక్ యూజర్స్ అందరికీ 'ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్'('సమాచారాన్ని భద్రంగా ఉంచుకోండి) పేరిట ఒక నోటీస్ వస్తుందని చెప్పింది.

యాప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు..

యాప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు..

ఆ నోటీసులోనే ఒక లింకు కూడా కనిపిస్తుందని, అందులో మనం వాడుతున్న యాప్స్.. ఏ యాప్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని షేర్ చేస్తున్నాం వంటి వివరాలన్ని ఉంటాయని తెలిపింది. ఒకవేళ ఏదైనా యాప్‌ను తొలగించాలనుకున్నా.. లేక మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చేయాలనుకున్నా.. దానికి అందులో వెసులుబాటు ఉంటుందని పేర్కొంది.

సెనేట్ ముందుకు జుకర్ బర్గ్..

సెనేట్ ముందుకు జుకర్ బర్గ్..

డేటా స్కాండల్ ఆరోపణల నేపథ్యంలో.. ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, అమెరికా కాంగ్రెస్‌ ప్రశ్నలను ఎదుర్కోబోతున్నారు. సెనేట్‌ జ్యుడిషియరీ, కామర్స్‌ కమిటీలు జుకర్‌బర్గ్‌ను మంగళవారం ప్రశ్నించనున్నారు.

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకు ఫేస్ బుక్ డేటా స్కాండల్ పరోక్షంగా సహకరించిందన్న ఆరోపణల నేపథ్యంలో.. భవిష్యత్తు ప్రణాళికలపై జుకర్‌బర్గ్‌ నుంచి సెనేట్ కొన్ని నిర్దిష్టమైన వాగ్దానాలు తీసుకోనుంది.

వీటికి సమాధానం చెప్పాల్సిందే..:

వీటికి సమాధానం చెప్పాల్సిందే..:

2015 నుంచే కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు యూజర్ల డేటాను షేర్‌ చేస్తున్నట్టు ఒప్పుకున్న ఫేస్‌బుక్‌... ఈ విషయాన్ని అప్పుడే ఎందుకు ప్రజలకు చెప్పలేదు?

ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ నుంచి అమెరికన్‌ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి.. ఆ కంపెనీలకు ఉన్న అవసరమేంటి?

ఫేస్‌బుక్‌ యూజర్లకు భవిష్యత్తులో యాజమాన్యం ఎలాంటి భరోసా కల్పిస్తుంది?

పొలిటికల్ పోలరైజేషన్ ను తగ్గించడానికి ఫేస్‌బుక్‌ ఎలా సహాయపడుతుంది? వంటి ప్రశ్నలను సెనేట్ నుంచి జుకర్ బర్గ్ ఎదుర్కోనున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Get ready to find out if your Facebook data has been swept up in the Cambridge Analytica scandal. Starting today, the 87 million users who might have had their data shared with Cambridge Analytica will get a detailed message on their news feeds.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+17339356
CONG+38588
OTH168298

Arunachal Pradesh

PartyLWT
BJP72330
JDU167
OTH3710

Sikkim

PartyLWT
SKM31417
SDF51015
OTH000

Odisha

PartyLWT
BJD1076113
BJP22022
OTH11011

Andhra Pradesh

PartyLWT
YSRCP0150150
TDP02424
OTH011

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more