వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నదేశంలో ఆన్‌లైన్‌ ఓటింగ్ విజయవంతం.. మరి మనదేశంలో ఎప్పుడో?

|
Google Oneindia TeluguNews

ఎస్టోనియా : ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం బాధ్యతనేది వేరే చెప్పనక్కర్లేదు. 18 ఏళ్లు నిండిన పౌరులు విధిగా ఓటేయ్యడం రాజ్యాంగం కల్పించిన హక్కు. సమర్థవంతమైన నేతలను ఎన్నుకునే ఆయుధం ఓటు హక్కు కల్పించింది. అయితే మన దేశంలో వివిధ కారణాలతో 30 శాతం మంది వరకు ఓటింగుకు దూరంగా ఉంటున్నారనేది ఒక అంచనా. కానీ ఉత్తర యూరప్ లోని ఒక చిన్న దేశమైన ఎస్టోనియాలో ప్రారంభించిన ఆన్‌లైన్‌ ఓటింగ్ సత్ఫలితాలను ఇస్తోంది.

చిన్నదేశంలో అద్భుతం

చిన్నదేశంలో అద్భుతం

పట్టణాలు, నగరాల కంటే మనదేశంలో పల్లెల్లోనే అధిక శాతం ఓటింగ్ నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాల కంటే కూడా విద్యావంతులు అధికంగా ఉండే నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుండటం ఇబ్బందికర పరిణామమే. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లేసే పరిస్థితి పట్టణ, నగర ఓటర్ల విషయంలో కనిపించడం లేదు. వివిధ కారణాలతో ఓటింగుకు దూరంగా ఉంటున్న యువతను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌ ఓటింగ్ ప్రవేశపెడితే కొంత ప్రయోజనకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర యూరప్ లోని చిన్నదేశమైన ఎస్టోనియాలో ఆన్‌లైన్‌ ఓటింగ్ అమలు చేస్తున్నారు.

అక్కడ అన్నీ ఆన్‌లైన్‌లోనే..!

అక్కడ అన్నీ ఆన్‌లైన్‌లోనే..!

చిన్నదేశమైనప్పటికీ టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో ఎస్టోనియా చాలా ముందుంది. ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నాయి. దాదాపు 99 శాతం సేవలు ఆన్‌లైన్‌లోనే అందుతుండటం విశేషం. పెళ్లైనా, విడాకులైనా, కొనుగోళ్లు, అమ్మకాలు.. ఇలా దాదాపు అన్నిరకాల సేవలు అక్కడి ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా పొందుతున్నారు. దీంతో మ్యాన్ పవర్ తక్కువగా ఉండటంతో పాటు పనిగంటలు కూడా చాలా కలిసొస్తున్నాయి.

2007 నుంచే అమలు

2007 నుంచే అమలు

ఎస్టోనియాలో ఆన్‌లైన్‌ ఓటింగ్ నిన్న మొన్న వచ్చింది కాదు. 2007 నుంచే ఇంటర్నెట్‌ ఓటింగ్‌ అమలు చేస్తుండటం విశేషం. పోలింగ్ కేంద్రాలకు కూడా ప్రజలు క్యూ కడుతున్నప్పటికీ.. ఇంటర్నెట్‌ ఓటింగ్‌ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఇదే నెలలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో 46 శాతం మంది ప్రజలు ఆన్‌లైన్‌ ఓటింగ్ సౌకర్యం వినియోగించుకున్నారట.

పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఇంటి నుంచో, ఆఫీస్ నుంచో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. అయితే
ఆన్‌లైన్‌ ఓటింగ్ విధానంలో మొదట ఓటర్లు తమ ఓటర్ ఐడీని మొబైల్ ఫోన్ నెంబర్లతో అనుసంధానం చేసుకోవాలి. ఓటింగ్ సమయంలో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవగానే సదరు మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే ఎలక్ట్రానిక్ బ్యాలట్ పత్రం స్క్రీన్ పై దర్శనమిస్తుంది. అలా ఓటరుకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే విధంగా వారి గుర్తుపై ఓటేసి సబ్‌మిట్‌ చేస్తే సరిపోతుంది.

మనదేశంలో ఎప్పుడో..?

మనదేశంలో ఎప్పుడో..?

చిన్నదేశమైన ఎస్టోనియా టెక్నాలజీని వాడేస్తోంది. ఓటు వినియోగం పెరిగిలా చర్యలు తీసుకుంటోంది. ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు అనేది కీలకమైన ఆయుధం. అది గ్రహించిన ఎస్టోనియా అధికార యంత్రాంగం ఆన్‌లైన్‌ ఓటింగును సమర్థవంతంగా అమలుచేస్తోంది. అంత చిన్నదేశమే ఆన్‌లైన్‌ ఓటింగ్ విధానం వాడుతున్నప్పుడు.. ఇంత పెద్దదేశమైన మన ప్రాంతంలో ఎప్పుడొస్తుందనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ ఆన్‌లైన్‌ ఓటింగ్ తెరపైకి వస్తే మాత్రం పోలింగ్ శాతం పెరిగే ఛాన్సుంది. అంతే కాదు దొంగ ఓట్లకు అడ్డుకట్టే వేయడానికి దోహదపడుతుంది.

English summary
The idea of having electronic voting in Estonia gained popularity in 2001 with the "e-minded" coalition government. Estonia became the first nation to hold legally binding general elections over the Internet with their pilot project for the municipal elections in 2005. The electronic voting system withstood the test of reality and was declared a success by Estonian election officials. The Estonian parliamentary election in 2007 also used internet voting, another world first.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X