వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డుపై బైఠాయించిన 18సింహాలు.. భారీ ట్రాఫిక్ జామ్..

అయితే ఇంత భారీ ఎత్తున సింహాల గుంపు రోడ్డు మీదకు రావడానికి కారణమేంటంటే.. ఓ దున్నపోతును వేటాడి.. దాన్ని రోడ్డు మీదకు లాక్కొచ్చిన సింహాలు ఆరగించడం మొదలుపెట్టాయి.

|
Google Oneindia TeluguNews

కేప్‌టౌన్: సింహాలన్ని ఏకమై రాస్తారోకో చేస్తున్నాయా? అన్న తరహాను తలపించేలా కనిపిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ నేషనల్‌ పార్కులో సందర్శకులకు కనిపించిన దృశ్యమిది.

పార్కును సందర్శించేందుకు వచ్చిన పలువురు రహదారికి అడ్డంగా బైఠాయించిన మృగరాజులను చూసి ఆశ్చర్యపోయారు. దీంతో తమ వాహనాలను పక్కనే నిలిపేసి అవి వెళ్లిపోయేదాకా అక్కడే వేచియున్నారు.

Now that's what you call a tailback! Pride of lions brings traffic

అయితే ఇంత భారీ ఎత్తున సింహాల గుంపు రోడ్డు మీదకు రావడానికి కారణమేంటంటే.. ఓ దున్నపోతును వేటాడి.. దాన్ని రోడ్డు మీదకు లాక్కొచ్చిన సింహాలు ఆరగించడం మొదలుపెట్టాయి. దాదాపు 18సింహాలు కలిసి ఆ దున్నపోతును ఆరగించడంతో.. రోడ్డు మీద వాహనాలు నడవలేని పరిస్థితి.

సువాన్‌ రైట్‌ అనే ఓ సందర్శకుడు ఈ సింహాల గుంపును వీడియో తీసి ఇంటర్నెట్ లోకి ఎక్కించాడు. ప్రస్తుతం ఆ వీడియో. ఫోటోలు ఇంటర్నెట్ లో వీక్షకులు ఆకట్టుకుంటున్నాయి.

English summary
A pride of lions decided to stop and eat their lunch in the middle of a road - bringing traffic to a standstill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X