వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీపై ఎన్ఎస్ఏ గూఢచర్యం: బాంబుపేల్చిన స్నోడెన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎడ్వర్డ్ స్నోడన్ అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) పైన మరో బాంబు పేల్చారు. భారత దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పైన ఎన్ఎస్ఏ గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపించారు.

NSA spied upon BJP, reveals Snowden

ఆరు అమెరికాయేతర రాజకీయ పార్టీలపై నిఘా వేసేందుకు ఎన్ఎస్ఏకు అనుమతి మంజూరైందని స్నోడెన్‌ను ఉటంకిస్తూ 'ది వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది. ఈ ఆరు పార్టీల పైనే కాకుండా అమెరికా ఫారెన్ ఇంటలిజెన్స్ సర్విలెన్స్ యాక్ట్ (ఎఫ్ఐఎస్ఏ) న్యాయస్థానం 193 దేశాల ప్రభుత్వాలపైనా కన్నేసేందుకు ఎన్ఎస్ఏ ఈ ప్రత్యేక అనుమతి ఇచ్చిందని స్నోడెన్ పేర్కొన్నారు.

వీటిలో భారత్ కూడా ఉందని తెలిపారు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలపై నిఘా వేసేందుకు మాత్రం అనుమతి లభించలేదట. బీజేపీ కాకుండా ఎన్ఎస్ఎ అమాల్ (లెబనాన్), బోలివియేరియన్ కాంటినెంటల్ కోఆర్డినేటర్, ముస్లిం బ్రదర్ హుడ్ (ఈజిప్టు), నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ (ఈజిప్టు), పీపుల్స్ పార్టీ (పాకిస్థాన్)పై గూఢచర్యానికి పాల్పడిందని చెప్పారు.

English summary
It has come to light that the United States National Security Agency had been authorised to spy on India's Bharatiya Janata Party, which is now in power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X