వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్‌లకు నిరసనగా జర్మన్ యువతి నగ్న ప్రదర్శన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్‌ 31 రాత్రి జరిగిన అత్యాచారాలతో జర్మనీ అట్టుడుకుతోంది. నూతన సంవత్సరం వేడుకల వేళ జర్మనీలోని కోలోగ్నీ నగరంలో ఐరోపా దేశాల మహిళలపై శరణార్థులు మూకుమ్మడి అత్యాచారాలు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ‘ఆ మహిళలంతా సెక్స్‌ కోసమే ఆ రాత్రి బయటకు వచ్చారు' అని ఓ విదేశీ పత్రిక వ్యాఖ్యానించడం మరింత ఆగ్రహానికి కారణమైంది.

కుదిపేస్తున్నమూకుమ్మడి రేప్‌లు: శరణార్థుల పనేకుదిపేస్తున్నమూకుమ్మడి రేప్‌లు: శరణార్థుల పనే

అంతేకాదు ఈ మూకుమ్మడి రేప్‌లపై ప్రభుత్వ స్పందన కూడా జర్మనీ ప్రజలను కోపోద్రిక్తులను చేస్తోంది. ఈ నేపథ్యంలో కోలోగ్ని నగరం రేప్‌లకు వేదికగా మారిందని, మిలోమూర్‌ అనే యువతి నగ్నంగా తన నిరసనను తెలియజేసింది. ‘మమ్మల్ని గౌరవించండి. మేం ఎగ్జిబిషన్‌లో దొరికే బొమ్మలం కాదు. మేం నగ్నంగా ఉన్నా కూడా మమ్మల్ని సాటి మనుషుల్లాగానే చూడండి' అని రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకుని కోలోగ్ని నగర వీధుల్లో నగ్నంగా తిరిగింది.

‘ఓ మహిళగా తాను ఎలా ఉండాలో నిర్దేశించే హక్కు ఎవరికీ లేదు. నచ్చినట్టు బతికే హాక్కు నాకుంది. స్వేచ్ఛ, స్వాతంత్యం అనేది పురుషులకే కాదు, మహిళలకు ఉంటుంది. అర్థరాత్రి బయటకు వచ్చారని, నగ్నంగా నిలబడ్డారని వారిని మనుషులు కాదనుకోకండి. ఈ ప్రపంచంలో మహిళకు సరిహద్దులు నిర్ణయించే హక్కు మగవారికి ఉంటుందా?' అని ఆమె ప్రశ్నించింది.

Nude parade in berlin for mass rape of german women

వివరాల్లోకి వెళితే డిసెంబర్ 31 రాత్రి జర్మనీలో దాదాపు 150 మంది మహిళలపై మూకుమ్మడి అత్యాచారాలు జరిగాయి. ఫిన్లాండ్ రాజధాని నగరం హెల్‌సింకీలో తాజాగా 50 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఆస్ట్రియా, స్వీడన్ దేశాల్లో కూడా పాతిక సంఖ్యలోనే రేప్ సంఘటనలు చోటు చేసుకున్నాయి.

దాంతో స్త్రీలు రాత్రిపూట ఇంటి నుంచి వీధుల్లోకి రాకూడదని, సమస్యాత్మక ప్రాంతాలు అసలే వెళ్లరాదని, క్లబ్బులూ పబ్బులూ అంటూ తిరగరాదని ఫిన్లాండ్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడుతున్నవారిలో 95 శాతం మంది శరణార్థులే. కాగా, బాధిత మహిళలంతా స్థానికులు కావడం విశేషం.

శరణార్థుల్లో 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యాచారాలకు పాల్పడుతున్నారని యూరప్ దేశాల అధికారులు చెబుతున్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన జరిగిన మూకుమ్మడి అత్యాచారాల సంఘటనల్లో పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు.

English summary
Nude parade in berlin for mass rape of german women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X