వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ చేస్తుండగా చూసి సూచనలివ్వాలి!: లక్షలు కురిపిస్తున్న వింత ఉద్యోగం

ప్రపంచంలో ఎన్నో రకాల ఉద్యోగాలుంటాయి. ఎవరైనా తమ ఉన్నతికి అనుగుణంగా ఉండే ఉద్యోగాలనే కోరుకుంటారు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రపంచంలో ఎన్నో రకాల ఉద్యోగాలుంటాయి. ఎవరైనా తమ ఉన్నతికి అనుగుణంగా ఉండే ఉద్యోగాలనే కోరుకుంటారు. కానీ, ఇక్కడ ఓ వింత ఉద్యోగం చేస్తున్నాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం భాగస్వామితో తమ శృంగారంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పలువురు పరిశోధకులు, రాజకీయ నాయకులు కూడా నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఓ కొత్త ఉద్యోగం అవతరించింది. దంపతులు తమ ఇంట్లో శృంగారం చేసుకుంటుండగా చూసి.. వారు చేస్తున్న తప్పులను సరిదిద్ది, వారికి సక్రమమైన శృంగార విధానాలను వివరించేదే ఈ ఉద్యోగం. ఉత్తమ శృంగారం కోసం చూసిన ఆ వ్యక్తి వారికి పలు ముఖ్యమైన సూచనలు చేస్తాడు.

NY man gets paid Rs 67000 for watching people have sex

కెన్నత్ ప్లే అనే మాజీ ఫిట్నెస్ ప్రొఫెషనల్.. సుమారు 50కిపైగా దేశాల్లోని చాలా మందికి కోచింగ్ ఇచ్చి వారి నుంచి ఒక సెషన్‌కి రూ. 67వేలను పొందుతున్నాడు. వారు సెక్స్ చేస్తుండగా చూసి.. ఆ తర్వాత వారికి శృంగారంలో ఏ విధంగా పాల్గొంటే బాగుంటుందని అతడు సూచనలు చేస్తాడు.

సెక్స్ పార్టీస్ వరకే పరిమితమైన తన వ్యాపారాన్ని కొందరు సిగ్గరుల కోసం తమ ఇంటికే వెళ్లి సూచనలు చేస్తున్నాడు కెన్నత్ ప్లే. ఇలా పడక గదిలో శృంగారం సంతృప్తిగా సాగేందుకు సూచనలు చేస్తూ కెన్నత్ భారీగా సంపాదిస్తున్నాడు. ప్రపంచంలో ఇలాంటి ఉద్యోగం కూడా ఉంటుందా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. అతనికి మాత్రం భలే గిరాకీ వస్తుండటం గమనార్హం.

English summary
People across the world keep talking about their dream job or a career that is actually fulfilling in life, but there are several jobs which might seem bizarre. Several researchers and medical experts have been working to help people have a better sex life, and now even politicians are getting involved by suggesting sex breaks at work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X