వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు అధ్యక్ష పదవి ఓ రియాల్టీ షో-కరోనా చావులకు బాధ్యుడు- ఒబామా నిప్పులు..

|
Google Oneindia TeluguNews

అమెరికా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. డెమోక్రాట్లతో పాటు కరోనా నిపుణులు, మీడియాపై నిత్యం రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్‌ నిప్పులు చెరుగుతుండగా.. ఇప్పుడు ఆయన్ను టార్గెట్‌ చేస్తూ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రంగంలోకి దిగారు. డెమోక్రాట్‌ అభ్యర్ధులైన జో బిడెన్‌, కమలా హ్యారిస్‌కు మద్దతుగా పెన్సిల్వేనియాలో ఒబామా ప్రచారం నిర్వహించారు. ఇందులో కరోనా కట్టడిలో విఫలమైన ట్రంప్‌ను గద్దె దింపాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

obama lambasted on disfunctioned donald trump in his first rally in us poll campaign

కరోనా ప్రభావం నుంచి అమెరికన్లను రక్షించడంలో ట్రంప్‌ దారుణంగా విఫలమయ్యారని, దీంతో 2.2 లక్షలమంది అమెరికన్లు చనిపోయారని, లక్షకు పైగా చిన్న సంస్ధలు మూతపడ్డాయని, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఒబామా నిప్పులు చెరిగారు. దక్షిణకొరియా, కెనడా వంటి దేశాలు కరోనాను ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయని ఒబామా గుర్తుచేశారు. కరోనా ప్రభావం, మరణాల్లోనూ ఆయా దేశాలు అమెరికా కంటే ఎంతో మెరుగ్గా ఉన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. తాను అభివృద్ధి చేసిన ఆర్ధిక వ్యవస్ధ గురించి చెప్పుకుంటున్న ట్రంప్‌.. కరోనా వైఫల్యాలను మాత్రం దాచేస్తున్నారని ఒబామా మండిపడ్డారు.

obama lambasted on disfunctioned donald trump in his first rally in us poll campaign

Recommended Video

US Elections 2020 : Telugu Appears on Ballot Boxes | Voter Ballot Papers In Telugu | Oneindia Telugu

చైనాను వ్యతిరేకిస్తున్నట్లు ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఒబామా తప్పుబట్టారు. చైనాలో ఆయనకు రహస్య బ్యాంక్‌ ఖాతా ఉంటుంది. చైనాతో ఆయన వ్యాపారం కూడా చేస్తుంటారు. బ్యాంక్‌ ఖాతా లేకపోతే ఆయన చైనాతో వ్యాపారం ఎలా చేస్తారని ఒబామా ప్రశ్నించారు. తాను ఇలాగే చైనా ఖాతా కలిగి ఉంటే మీడియా ఊరుకునేదా అని ఒబామా ప్రశ్నించారు. తాను తీసుకొచ్చిన ఒబామా కేర్‌ను తొలగించి ప్రత్యామ్నాయం కూడా లేకుండా చేయడంపై రిపబ్లికన్లను ఒబామా విమర్శించారు.

English summary
With less than two weeks to go before Election Day, Fomer us president barrack obama campaigned for his former deputy and democratic party presidential candidate joe biden and vice president candidate kamala harris. Obama said Mr.Trump was not interested in the job and was using the presidency as a reality show to get attention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X