వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడిబి డైరెక్టర్‌గా భారత సంతతి మహిళ స్వాతి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మహిళ స్వాతి దండేకర్ ఏసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) డైరెక్టర్ గా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండో-అమెరికన్ స్వాతిని ఏడీబీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను నూతన అధికారులు తమ విధి నిర్వహణతో ఛేదిస్తారని అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. వీరితో కలిసి పనిచేస్తూ మరింత ముందుకు వెళ్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

2003లో అమెరికా దిగువ సభకు ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఆమెతో సహా మరికొంత మందిని ఏడీబీ కార్యవర్గంలో చేరారు.

Obama names Indian-origin Swati Dandekar as ADB director

స్వాతి దండేకర్ గతంలో 2003-2009 మధ్య దిగువ సభ సభ్యురాలిగా, దిగువ సభ సెనెట్ సభ్యురాలిగా 2009-2011 కాలంలో విధులు నిర్వర్తించారు. భారత్‌లోని నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీ, బాంబే వర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు.

అమెరికా అధ్యక్షుడి ప్రకటనతో ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న రాబర్ట్ ఎం ఓర్ర్ స్థానంలో స్వాతి దండేకర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

English summary
President Barack Obama has nominated India-born Swati A. Dandekar, a Nagpur and Bombay University alum, to be United States director of the Asian Development Bank, with the rank of ambassador.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X