వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్: గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన బరాక్ ఒబామా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గిన్నీస్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టారు. ట్విట్టర్‌లో ఖాతా తెరిచిన కేవలం ఐదు గంటల్లోనే ఏకంగా పది లక్షల మంది ఫాలోవర్లను సంపాదించి, ఈ ఫీట్ సాధించిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు. @POTUS అనే పేరుతో ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాను సోమవారం ప్రారంభించారు.

పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ పేరుమీద తెరిచిన ఖాతాకు కేవలం ఐదు గంటల్లోనే పది లక్షల మంది ఫాలోవర్లు వచ్చిన విషయాన్ని గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

Obama's New Twitter Account Just Broke A Guinness World Record

కాగా, ఇంతకుముందు నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ 23 గంటల 22నిమిషాల్లో పదిలక్షల మంది ఫాలోవర్లను సంపాదించాడు. ఒబామాకు ఇంతకుముందే @BarackObama అనే ఐడీతో ట్విట్టర్ ఖాతా ఉంది. అయితే అధికారక ఖాతా కోసం దీన్ని కొత్తగా తెరిచారు. కాగా, ఒబామా పాత ఖాతా కూడా 53.3లక్షల మంది ఫాలోవర్లతో మూడోస్థానంలో ఉంది.

'హలో ట్విట్టర్! నేను బరాక్ ఒబామా. ఆరేళ్ల తర్వాత నేను సొంత ఖాతా తెరిచా' అని ఒబామా తొలిసారి ట్వీట్ చేశారు. ఇది కేవలం బరాక్ ఒబామాది మాత్రం కాదు. అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా.

కాగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే వారికి ఈ ఖాతాను బదిలీ చేస్తామని అధికారిక భవనం వైట్‌హౌస్ ఇంటర్ నెట్ స్ట్రాటజీ అసిస్టెంట్ డైరెక్టర్ అలెక్స్ వాల్ తెలిపారు.

English summary
President Barack Obama broke the Guinness world record Monday for the "fastest time to reach 1 million followers on Twitter."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X