వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

60ని. ఇంటర్వ్యూనే తట్టుకోలేకపోయాడు.. ఇక రెండోసారి అధ్యక్ష పదవి కట్టబెడుదామా : ఒబామా

|
Google Oneindia TeluguNews

తన స్వార్థ ప్రయోజనాల కోసం... సంపన్నులైన తన స్నేహితులకు మేలు చేయడం కోసమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలనుకుంటున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు,ట్రంప్‌ తోలుమందం వ్యక్తి అని... అందుకే సీబీఎస్ న్యూస్‌ ఛానెల్‌లో హైప్రొఫైల్ ఇంటర్వ్యూ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారని విమర్శించారు. రిపోర్టర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ట్రంప్ ఆ ఇంటర్వ్యూ నుంచి మధ్యలో వెళ్లిపోయారని అన్నారు. ఒక ఇంటర్వ్యూనే ఎదుర్కోలేని వ్యక్తికి రెండోసారి అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాబట్టి ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కే ఓటు వేయాలని అమెరికన్లకు ఒబామా పిలుపునిచ్చారు.

ఇంటర్వ్యూనే తట్టుకోలేకపోయాడు..

ఇంటర్వ్యూనే తట్టుకోలేకపోయాడు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో ఒకటిగా భావిస్తున్న ఫ్లోరిడాలో జో బైడెన్‌తో కలిసి ఒబామా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డెమోక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ... 'సీబీఎస్ న్యూస్ చానెల్‌ 60 నిమిషాల ఇంటర్వ్యూ నుంచి ట్రంప్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నలు ఆయనకు చాలా కష్టంగా కనిపించాయి. మీరు రెండోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పండి.. అన్న ప్రశ్నకే సమాధానం చెప్పకపోతే... రెండోసారి ఎందుకని ఆయనకు అధికారం కట్టబెట్టాలి. 60నిమిషాల ఇంటర్వ్యూనే మీకు కష్టంగా అనిపిస్తే... అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం ఎందుకు ఇవ్వాలి..?' అని ఒబామా ప్రశ్నించారు.

ట్రంప్‌కు రియాలిటీ తెలియదు...

ట్రంప్‌కు రియాలిటీ తెలియదు...

'ఆ ఇంటర్వ్యూలో రిపోర్టర్.. కోవిడ్ 19 తదుపరి దశను ఎదుర్కోవడానికి మీవద్ద ఉన్న ప్లాన్ ఏంటి అని అడిగారు. నిజానికి అది చాలా మంచి ప్రశ్న. ఓవైపు మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... మీరంతా ట్రంప్ నుంచి ఈ ప్రశ్నకు ఎలాంటి స్పందన వస్తుందోనని చూసుంటారు. కానీ ట్రంప్ మాత్రం కోవిడ్ 19 వ్యాప్తి తన తప్పు కాదని సింపుల్‌గా చేతులు దులిపేసుకున్నారు. నిజానికి ఆయన వద్ద ఎలాంటి ప్లాన్ లేదు. కనీసం రియాలిటీపై కూడా ఆయనకు అవగాహన లేదు.' అని ఒబామా పేర్కొన్నారు.

బైడెన్‌ని గెలిపించండి : ఒబామా

బైడెన్‌ని గెలిపించండి : ఒబామా

'కేవలం విమర్శించినందుకే జైలుకు పంపిస్తానని ప్రజలను బెదిరించే అధ్యక్షుడు మనకు వద్దు. ఎవరినైనా సరే కించపరిచే మనస్తత్వం... నాతో ఎవరూ సరితూగరు అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి అధ్యక్షుడిగా మనకు వద్దు. అలాంటి ధోరణి సరైనది కాదు. ఈ తరహా ధోరణిని మన తోటి ఉద్యోగి నుంచి ఎదురైతేనే ఉపేక్షించలేం. అంతెందుకు మన కుటుంబ సభ్యుల నంచి ఎదురైనా ఉపేక్షించలేం. మరెందుకు ట్రంప్‌ను మాత్రం ఉపేక్షించాలి.' అని ఒబామా వ్యాఖ్యానించారు. కాబట్టి ట్రంప్ లాంటి వ్యక్తిని పక్కనపెట్టి ఈ ఎన్నికల్లో జో బైడెన్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

English summary
While asking for support at a drive-in car rally in the state of Florida on Saturday for former vice president Joe Biden, the presidential candidate of the Democratic Party, and his running mate Senator Kamala Harris, Barack Obama urged Americans not to give a second term to Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X