వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిల్లరీని కాదని ట్రంప్ మద్దతుదారుడికి అండగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ఒబామా

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమెరికా : అమెరికా అద్యక్ష ఎన్నికల్లో అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా తమ పార్టీ అభ్యర్థి హిల్లరీకి కాకుండా ప్రత్యర్థి పార్టీ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడికి ఆయన మద్దతు పలికారు.ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అమెరికా ఎన్నికల్లో ప్రచారం మరింత వేడెక్కింది. అమెరికా అద్యక్షుడు ఒబామా కూడ తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు.

అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఒబామా ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఆ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. ఇద్దరి మద్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉందని సర్వేలు చెబుతున్నాయి.అయితే తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఒబామా నిర్వహించిన సభలో ఆయన ట్రంప్ కు మద్దతిచ్చిన వ్యక్తిని బలపర్చడం ఆశ్చర్యానికి గురిచేసింది.

నార్త్ కెరోలినాలో డెమొక్రటిక్ పార్టీ ఎన్నికల ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు ఒబామా పాల్గొన్నారు.ఒబామా ప్రసంగించే సమయంలో ఓ వ్యక్తి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ప్ల కార్డు పట్టుకొన్నారు. ఆ వ్యక్తిని ఒబామా గమనించాడు.మిలటరీ దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తి ట్రంప్ కు మద్దతుగా ప్ల కార్డు పట్టుకొని నిలబడ్డాడు.సభలో ఎలాంటి అల్లరి చేయలేదు.

obama support trump supporter in america election campaign

ఒబామా మాట్లాడే సమయంలో ఆ వ్యక్తి వ్యవహిరంచిన తీరు హిల్లరీ మద్దతుదారులకు కోపం తెప్పించింది.ట్రంప్ కు మద్దతుగా ప్లకార్డు పట్టుకొన్న ఆ వ్యక్తిని సభ నుండి బయటకు పంపేందుకు హిల్లరీ మద్దతుదారులు ప్రయత్నించారు.దీంతో ఒబామా వారిిక సర్థిచెప్పేందుకు తీవ్రంగా కష్టపడ్డాడు.ఒబామా పదే పదే హిల్లరీ మద్దతుదారులకు చెప్పినా వారు విన్పించుకోలేదు. ఒకానొక దశలో అసహానానికి గురైన ఒబామా గట్టిగా హిల్లరీ మద్దతుదారులపై అరిచారు.

ట్రంప్ కు మద్దతుగా ఆయన ప్లకార్డు ప్రదర్శించాడు. ఎలాంటి గొడవ చేయలేదు. ఆయన ఆర్మీలో పనిచేసినవాడు. వయస్సులో పెద్దవాడు అంటూ ట్రంప్ మద్దతుదారుడిని ఒబామా వెనకోసుకొచ్చాడు. అంతేకాదు ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. హిల్లరీ మద్దతుదారులను ఆయన శాంతింపజేశాడు.ఎన్నికల సమయంలో జాగ్రత్గా ఉండాలని ఆయన కోరారు.

English summary
america president obama support to donald trump supporter in north carolina election meeting. obama participated in the meeting for campaign hillary. one man standing with supported play card trump in obama meeting,hillary supporters were angry this situation.obama support trump supporter, because he didn't any disturbance in meeting, he worked in army,and also he is senior citizen said obama.everyone take care of elections siad obama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X