వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రసవత్తరంగా అమెరికా పోరు- రంగంలోకి ఒబామా.. తన మాజీ డిప్యూటీ బిడెన్‌ గెలుపు కోసం..

|
Google Oneindia TeluguNews

హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ట్రంప్‌ అధికారం నిలబెట్టుకుంటారా లేక బిడెన్‌ అధ్యక్షుడు కానున్నారా అనే దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్‌కు కరోనా సోకడం, అమెరికాలో కరోనా వ్యాప్తికి ఆయన నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బిడెన్‌వైపే అందరి చూపు నెలకొంది. అయితే ట్రంప్‌ అవకాశాల్నీ కొట్టిపారేయలేమని అమెరికాలో వాదనలు వినిపిస్తున్నాయి.

ఆసక్తికరంగా సాగుతున్న అమెరికా ఎన్నికల ప్రచారంలోకి మాజీ అధ్యక్షుడు, నల్లజాతీయుడైన బరాక్‌ ఒబామా అడుగుపెడుతున్నారు. సొంత పార్టీ డెమోక్రాట్‌ అభ్యర్ధి అయిన జో బిడెన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఫిలడెల్ఫియాలో జరిగే ప్రచార ర్యాలీలో సొంతంగా కారు నడుపుతూ ఒబామా పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక ఒబామా వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో డెమోక్రాట్లు ఆయన్ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.

obama to makes debut for his former deputy Joe Biden, to hold drive-in car rally

ఒబామా గతంలో ఎనిమిదేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో జో బిడెన్‌ ఆయన దగ్గరే ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో ఒకప్పటి తన డిప్యూటీ కోసం కీలక తరుణంలో రంగంలోకి దిగాలని ఒబామా నిర్ణయించారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులు, నల్ల జాతీయుడైన ఫ్రాయిడ్‌ పోలీసుల చేతుల్లో చనిపోయిన నేపథ్యంలో తలెత్తిన ఆందోళనలు ఈ ఎన్నికలపై గట్టిగా ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో నల్లజాతీయుడైన ఒబామాను రంగంలోకి దింపడం ద్వారా డెమోక్రాట్‌ ఉపాధ్యక్ష అభ్యర్ధి, నల్లజాతీయురాలైన కమలా హ్యారిస్‌తో పాటు ఒకప్పటి తన డిప్యూటీ బిడెన్‌ను కూడా గట్టెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

obama to makes debut for his former deputy Joe Biden, to hold drive-in car rally

Recommended Video

US Election 2020 : Joe Bidenకు ఓటమి తప్పదు.. ఆ చెత్తను ఊడ్చిపారేస్తా! - Donald Trump

అమెరికా ఎన్నికల ఫలితాలను మలుపుతిప్పుతాయని భావిస్తున్న బ్యాటిల్‌ గ్రౌండ్‌ రాష్ట్రాల్లో ఒకటైన ఫిలడెల్ఫియాలో ఒబామా డెమోక్రాట్‌ అభ్యర్ధులకు మద్దతుగా కార్ల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ఆయనే స్వయంగా కారు నడుపుతారని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఈ ర్యాలీ కూడా ఆసక్తి రేపుతోంది.

English summary
Former US President Barack Obama will make his first appearance on the campaign trail on Wednesday for Democratic nominee Joe Biden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X