వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ కాల్పుల్లో 4గురు భారత నర్సులు మృతి

|
Google Oneindia TeluguNews

యెమెన్‌: అడెన్ ప్రాంతంలోని షేక్ ఉస్మాన్‌లోని సంరక్షణాలయంలో శుక్రవారం నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు భారతీయ నర్సులు సహా 16మంది మృత్యువాతపడ్డారు.

అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు సాయుధులు శుక్రవారం నర్సులపై కాల్పులకు తెగబడ్డారు. కొందరు ప్రజల చేతులు కట్టేసి కాల్చి చంపారు. దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నట్లు సమాచారం.

Officials: Gunmen kill 16 people at retirement home in Yemen

ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి

జింబాబ్వేలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించగా, మరో 36 మంది గాయాలపాలయ్యారు. జింబాబ్వే రాజధాని హరారే నుంచి బులవాయో నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

రెండు బస్సులు డ్రైవర్లతో కలిపి 28 మంది ప్రమాదస్థలంలో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన వారిలో 32 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

English summary
Yemeni security officials say gunmen have stormed a retirement home in the southern city of Aden, killing 16 people, including 4 Indian nuns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X