వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త నుండి విడాకులు: భరణం కింద రూ. 6 వేల కోట్లను తిరస్కరించింది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఓ మహిళకు భరణంగా వచ్చిన 975 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,162 కోట్లు)ను తిరస్కరించింది. వివరాల్లోకి వెళితే, అమెరికాలో ఆయిల్ చక్రవర్తిగా పేరున్న హెరాల్డొ హమ్ 26 ఏళ్ల క్రితం సూ యాన్ ఆర్నాల్‌ను వివాహం చేసుకున్నాడు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

Oil Magnate’s Wife Rejects 975 Million Divorce Check

ఏవో కొన్ని మనస్పర్ధవల్ల గత ఏడాది నవంబర్‌లో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు భరణంగా ఒక బిలియన్ డాలర్లు ఇవ్వాలని కోర్టు తీర్పినిచ్చింది. కోర్టు తీర్పు అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరల పతనం కారణంగా తన ఆస్తి తరిగిందని చెబుతూ, 975 మిలియన్ డాలర్ల చెక్‌ను పంపాడు.

దీంతో హెరాల్డొ హమ్ మొత్తం ఆస్తుల్లో తన వాటా కింద 18 బిలియన్ డాలర్లు రావాలంటూ... ఆయన భార్య ఆర్నాల్ ఆ చెక్‌ను వెనక్కి పంపించి మరోసారి కోర్టును ఆశ్రయించనుంది. అమెరికాలోని నార్త్ డకోటాలో బయటపడ్డ అతి పెద్ద ముడి చమురు క్షేత్రం హెరాల్డొ హమ్‌‌ది కావడం విశేషం.

English summary
Oil executive Harold Hamm offered his ex-wife a handwritten check for $974.8 million in order to settle their bitter divorce, but Sue Ann Arnall rejected it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X