వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్కీ అంటే అదే.. 430కి కొంటే 6 కోట్లు వచ్చాయి..!

|
Google Oneindia TeluguNews

లండన్ : లక్కీ అంటే నిజంగా వాళ్లదే. అప్పుడెప్పుడో 430 రూపాయలకు కొన్న వస్తువు ఇప్పుడు ఏకంగా 6 కోట్ల 30 లక్షల రూపాయలు పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అదేదో షేర్ కాదు, ఇంకేదో కాదు. ఒక చదరంగం పావు అంత ధర పలికిందంటే విస్తుపోవాల్సిన పరిస్థితి. కానీ వేలం పాటలో ఓ ఔత్సాహికుడు మాత్రం 6 కోట్లకు పైగా చెల్లించి దాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

లండన్‌లో జరిగిన వేలం పాటలో ప్రాచీన కాలానికి చెందిన ఓ చదరంగం పావు అత్యధిక ధర పలకడం వైరల్‌గా మారింది. తొమ్మిది వందల సంవత్సరాల కిందటి లెవిస్ చెస్‌మ్యాన్ పావు 6 కోట్ల 30 లక్షల రూపాయలకు అమ్ముడు పోయింది. 1964వ సంవత్సరంలో ఐదు పౌండ్ల (ఇండియన్ కరెన్సీలో 430 రూపాయలు) కు ఓ వ్యక్తి దాన్ని కొనుగోలు చేశారు. అయితే మంగళవారం నాడు లండన్‌లో జరిగిన ఆక్షన్‌లో ఓ వ్యక్తి 7 లక్షల 35 వేల పౌండ్ల (ఇండియన్ కరెన్సీలో 6 కోట్ల 30 లక్షలు) కు వేలం పాడి సొంతం చేసుకున్నాడు.

Old chess piece bought for Rs 430 was just sold for Rs 6 crore at London auction

ఒకరు హెచ్ఎం.. మరొకరు మహిళా టీచర్.. ఇద్దరి నోట బూతు పురాణం..!ఒకరు హెచ్ఎం.. మరొకరు మహిళా టీచర్.. ఇద్దరి నోట బూతు పురాణం..!

పన్నెండవ శతాబ్దానికి చెందిన వార్లస్ అనే సీ యానిమల్ దంతంతో ఈ చదరంగం పావు తయారుచేయబడింది. నార్సె యోధులను పోలి ఉంటాయి ఈ లెవిస్‌ చెస్‌మ్యాన్‌ పావులు. యూరోపియన్‌ హిస్టరీలో వైకింగ్‌ శకానికి చెందిన కళాకృతులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వాటికి బహిరంగ మార్కెట్‌లో మాంఛి డిమాండ్ ఉండటం విశేషం.

1831లో స్కాట్లాండ్‌లోని ఇస్లే ఆఫ్‌ లెవిస్‌లో ఇలాంటి చదరంగం పావులు పెద్ద ఎత్తున లభించాయి. మొత్తం ఐదు సెట్ల చెస్‌ పావులు దొరికినట్లు చరిత్ర చెబుతోంది. వాటిలో నుంచి అదృశ్యమైన ఈ చెస్‌ పావు కాలక్రమేణా చేతులు మారింది. చివరకు లండన్‌లో వేలంపాటకు వచ్చినట్టు భావిస్తున్నారు. 1964లో ఎడిన్‌బర్గ్‌కు చెందిన డీలర్‌.. తమ నుంచి ఈ చెస్‌ పావును ఐదు పౌండ్లకు కొనుగోలు చేసినట్టు స్క్వాటిష్‌ డీలర్‌ కుటుంబ ప్రతినిధి వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
An antique Lewis Chessman piece that is about 900-years-old was sold at a whopping amount of Rs 6 crore at an auction house in London on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X