• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒలింపిక్స్: టోక్యోలో వేడుకగా ప్రారంభమైన క్రీడలు

By BBC News తెలుగు
|
ఒలింపిక్స్ ప్రారంభం

ఒలింపిక్ వేడుకలు టోక్యోలోని జపాన్ నేషనల్ స్టేడియంలో అట్టహాసంగా మొదలయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఉన్న పరిమితులు, నియంత్రణల మధ్య ఖాళీగా ఉన్న స్టేడియంలో పోటీలు జరగనున్నాయి.

ఈ క్రీడల ప్రారంభ వేడుకకు జపాన్ చక్రవర్తి నరాహితో హాజరయ్యారు.

అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బేచ్ ఆయనకు సాదర ఆహ్వానం పలికారు.

https://twitter.com/Tokyo2020/status/1418528434955841538

1960లో జపాన్‌లో జరిగిన ఒలింపిక్స్ సమయంలో తన నాలుగేళ్ల వయసులో వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఇప్పుడు చక్రవర్తి హోదాలో మరోసారి ఈ వేడుకలలో పాలుపంచుకుంటున్నారు.

ప్రస్తుత వేడుకలకు వెయ్యి కంటే తక్కువ మందే హాజరయ్యారు.

ఈ రోజు(జులై 23) నుంచి ఆగస్టు 8 వరకు జపాన్‌లోని టోక్యోలో ఈ పోటీలు జరగబోతున్నాయి.

అయితే, ప్రారంభ కార్యక్రమానికి రెండు రోజుల ముందే, అంటే జులై 21నే ఫుకుషిమాలో ''సాఫ్ట్‌బాల్'' పోటీలు మొదలయ్యాయి.

33 విభాగాల్లో 339 పతకాల కోసం ఈ సారి క్రీడాకారులు పోటీ పడబోతున్నారు.

తొలి పతాక ప్రధాన కార్యక్రమం శనివారం(జులై 24) నిర్వహిస్తారు.

టోక్యోలో జరుగుతున్న ఈ వేడుకలను విదేశీయులు నేరుగా చూసేందుకు అనుమతి లేదు.

https://twitter.com/ANI/status/1418524488438718466

వేడుకల ప్రారంభం రోజున భారత అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకుర్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు.

గతంలో ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న యోగీశ్వర్, కరణం మల్లీశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టోక్యో నుంచి వచ్చాక భారత అథ్లెట్లు అందరినీ ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా కలుస్తారని అనురాగ్ ఠాకుర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
ఒలింపిక్స్: టోక్యోలో వేడుకగా ప్రారంభమైన క్రీడలు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X