• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బికినీ ధరించిందని ఆ తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తూ కోర్టు తీర్పు

|

భర్త నుంచి వేరుపడిన ఓ మహిళ తన బిడ్డ కోసం కొనసాగించిన పోరులో ఓడిపోయింది. కేవలం తన వస్త్రధారణ ఆధారంగా బిడ్డపై అధికారాలు ఆ తల్లికి ఇవ్వలేమని స్వయంగా కోర్టు తీర్పు చెప్పడం పలువురిని ఆలోచింపజేస్తోంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది...ఎవరా తల్లి... జరిగిన కథేమిటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తితో అమెరికా మహిళకు వివాహం

సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తితో అమెరికా మహిళకు వివాహం

కొన్నేళ్ల క్రితం బెతనీ వియేరా అనే మహిళకు సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కొన్నేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. వారికి ఓ నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. అమెరికాకు చెందిన బెతనీవి పాశ్చాత్య దేశపు అలవాట్లు. ఇక్కడే ఆమెకు సౌదీ అరేబియాకు చెందిన మాజీ భర్తకు పొరపొచ్చాలు వచ్చాయి. ఇక అక్కడి నుంచి వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. చిలికి చిలికి గాలివానలా మారాయి. దీంతో కాపురం కాస్త కోర్టుమెట్లు ఎక్కింది. విడాకులు కోసం దరఖాస్తు చేసుకున్న బెతనీ... ఇందులో విజయం సాధించింది. విడాకులు మంజూరు చేసింది సౌదీ కోర్టు.

కూతురు బాధ్యతలు ఇందుకోసం తల్లికి అప్పగించలేదు

కూతురు బాధ్యతలు ఇందుకోసం తల్లికి అప్పగించలేదు

ఇక కొన్ని రోజుల తర్వాత కూతురు తనకు అప్పగించాలంటూ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు మాత్రం ఇందుకు అంగీకరిచలేదు. నాలుగేళ్ల తన కూతురికి ఈ సమయంలో తల్లి అవసరం చాలా ఉంటుందని గట్టిగా వాదించినప్పటికీ ఆమెకు నిరాశే మిగిలింది. నాలుగేళ్ల జీనా బాధ్యతలు తండ్రికే అప్పచెప్తూ సౌదీ కోర్టు తీర్పు చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలింది బెతనీ. అయితే కోర్టు ఈ తీర్పు ఇవ్వడం వెనక బెతనీ మాజీ భర్త ఆమెకు సంబంధించిన ఓ ఫోటోను న్యాయస్థానం ముందు ఉంచడమే. బెతనీ బికీనీ ధరించిన ఫోటోను న్యాయమూర్తి ముందు ఉంచాడు మాజీ భర్త. దీంతో పాశ్చాతదేశానికి చెందిన బెతనీ.. తన బిడ్డ బాధ్యతలు తీసుకునేందుకు అర్హురాలు కాదంటూ తీర్పు చెప్పింది. అంతేకాదు ఆమె సొంత యోగా స్టూడియో నడుపుతున్నందున బిడ్డ బాగోగులు చూసేందుకు సమయం సరిపోదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. బిడ్డను పాశ్చాత్య దేశపు అలవాట్ల నుంచి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందని అందుకే బిడ్డ మాజీ భర్త దగ్గర ఉంటేనే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది.

వీడియో సాక్ష్యాలను నమ్మని కోర్టు

వీడియో సాక్ష్యాలను నమ్మని కోర్టు

మరోవైపు మాజీ భర్త డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని కోర్టుకు గొంతుఅవిసేలా చెప్పినప్పటికీ కోర్టు ఆమె మొర ఆలకించలేదు. పైగా మాజీ భర్త చెప్పిన మాటలనే కోర్టు ఆలకించింది. ఆమెకు అరబిక్ భాష రాదని పైగా బికినీలు ధరించి యోగా నేర్పుతోందని ... బహిరంగ ప్రదేశాలకు వెళ్లిన సమయంలో బుర్ఖా ధరించడం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే ఆ ఫోటోలు తను అమెరికాలో ఉన్న సమయంలో తీసినవని అవి కూడా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తీసిన ఫోటోలని కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు మాత్రం మాజీ మాజీ భర్త చెప్పిన మాటలనే పరిగణలోకి తీసుకుందని భోరున విలపించింది. ఇక డ్రగ్స్ అలవాటు చేసింది బెతానీనే అని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు మాజీ మాజీ భర్త. మొత్తానికి బెతనీ వీడియోతో కూడిన రుజువులు చూపించినప్పటికీ కోర్టు మాత్రం పరిగణలోకి తీసుకోకుండా మాజీ మాజీ భర్త చెప్పిన మాటలకే విలువ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.

 సంస్కరణలు తీసుకొచ్చిన మొహ్మద్ బిన్ సల్మాన్

సంస్కరణలు తీసుకొచ్చిన మొహ్మద్ బిన్ సల్మాన్

సౌదీ అరేబియాలో మహిళలపై పలు ఆంక్షలు ఉన్నాయి. అదే సమయంలో మహిళలు డ్రైవింగ్ చేయొచ్చు అంటూ ఆ దేశ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ జారీ చేసిన ఆదేశాలతో అక్కడి మహిళలకు కొంత ఊరట లభించినట్లయ్యింది. అయితే ఈ ఘటనతో అక్కడి కోర్టులు మాత్రం మళ్లీ పాతరోజులనే గుర్తు చేస్తున్నాయి. అందరం మనుషులమే అని అనుకున్నప్పుడు ఆడ మగ మధ్య బేధం ఎందుకుండాలని నాడు మొహ్మద్ బిన్ సల్మాన్ ప్రశ్నించారు. అయితే ఈ మార్పులు ఇంకా సౌదీలోని ప్రాథమిక ఆంక్షలను ఎత్తివేయలేదు.

ఇస్లామిక్ చట్టాలు ఏం చెబుతున్నాయి..?

ఇస్లామిక్ చట్టాలు ఏం చెబుతున్నాయి..?

సౌదీ చట్టాలు ఇస్లామిక్ చట్టాల ఆధారంగా రూపొందించబడ్డాయి. దీన్నీ షరియా అని కూడా అంటారు. దీని ప్రకారం మగపిల్లవాడికి 9 ఏళ్లు, ఆడపిల్లకు ఏడేళ్లు వచ్చే వరకు వారి బాధ్యతను తల్లే చూసుకుంటుంది. తండ్రులు గార్డియన్‌లుగా వ్యవహరిస్తారు.అయితే విడాకుల తర్వాత కూడా బిడ్డల బాధ్యత తల్లికే అప్పగిస్తూ గతేడాది సౌదీ కోర్టు తీర్పు వెలువరించింది. బాధ్యతలు తనకే కావాలంటూ తండ్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అప్పుడు పరిస్థితులు విచారణ ఆధారంగా బిడ్డ బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని కోర్టు తన తీర్పులో ఆనాడు వెల్లడించింది.

మొత్తానికి బిడ్డను తనకు ఇవ్వకపోవడంతో గుండెలవిసేలా రోదించిన బెతానీ... ఇది కేవలం తన కన్నీటి గాథ కాదని తనలా బాధపడుతున్న ఇతర మహిళలు కూడా ఉన్నారని వారిని కలిసి సౌదీ అరేబియాలో జరుగుతున్న ఈ అన్యాయంపై పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు.

English summary
An American Woman who was married to a Saudi man was denied to secure custody of her 4 year old daughter after she was divorced from her husband by the Saudi court.The court believed that the woman cannot raise the child as she had adopted the western culture. The former husband produced a photo of her's wearing a bikini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X