వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron:డెల్టా కన్నా 3 రెట్లు రీ ఇన్ ఫెక్షన్, ఒమిక్రాన్ గురించి సౌతాఫ్రికా సైంటిస్టులు

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వైరస్ గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. అదీ డెల్టా, బీటా వచ్చిన వారికి తిరిగి వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువ ఉంటుందని వివరించింది. ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువ ఉంటుందని పేర్కొంది. నవంబర్ 27వ తేదీ వరకు 2.8 మిలియన్ మందికి పరీక్షలు చేశారు. ఇందులో 35,670 మందికి తిరిగి పాజిటివ్ వచ్చింది. 90 రోజుల తర్వాత పరీక్షించి చూశారు. థర్డ్ వేవ్ వరకు ఒక్కొక్కరిని పరీక్షించి చూగా.. అందరికీ తొలి విడత డెల్టా వేరియంట్ వచ్చిందని సౌతాఫ్రికా డీఎస్ఐ ఎన్ఆర్ఎఫ్ డైరెక్టర్ జులియట్ పుల్లియన్ వివరించారు.

ఇండివిజువల్ వ్యాక్సినేషన్ సమాచారం మాత్రం తెలియరాలేదు. వ్యాక్సిన్ వల్లే వైరస్ నిర్మూలన జరుగుతుందని వివరించారు. సీరియస్ నెస్ తగ్గిస్తోందని తెలిపారు. ఆస్పత్రికి వెళ్లడాన్ని, మరణాలను తగ్గిస్తోందని తెలిపారు. ఇప్పటికే ఒమిక్రాన్ వైరస్ చాలా దేశాలకు వ్యాపిస్తోందని చెప్పారు.

Omicron Causes 3 Times As Many Reinfections As Delta: Study

ఇటు సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వచ్చిన వారు స్వల్ప లక్షణాలు వచ్చాయని శాస్త్రవేత్తలు అంగీకరించారు. డెల్టా కూడా యువతపైనే వచ్చిందని.. ఆరోగ్యంగా ఉన్నవారికి వచ్చిందని.. ఒమిక్రాన్ కూడా అదేవిధంగా ఉంటుందని చెప్పారు. అయితే వైరస్ సోకిన వారు.. రోగ నిరోధక శక్తి ఎక్కువగా లేనివారు వెంటనే ఆస్పత్రికి వచ్చారని వివరించారు. బూస్టర్ డోసు.. రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే ట్రావెల్ బ్యాన్ పనిచేయదని ఆయన అభిప్రాయపడ్డారు. అదీ సౌతాఫ్రికాలో అయితే ఓకే కానీ.. మనదేశానికి వర్తించదని అభిప్రాయపడ్డారు. ఆర్టీ పీసీఆర్ పరీక్షతో ఒమిక్రాన్ వైరస్ గుర్తించలేమని తెలిపారు.

ఇటు విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు జరపాలని భారత ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. 'ఎట్‌ రిస్క్‌' జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారికి ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫలితాలు వచ్చే వరకూ ఎయిర్‌పోర్టులోనే ఉండాలని నిబంధన పెట్టింది. పాజిటివ్‌గా తేలినవారికి 14 రోజులు క్వారంటైన్‌, జన్యుక్రమ విశ్లేషణ కోసం వారి నమూనాలను ఇన్సాకాగ్‌కు పంపించాలని తెలిపింది. ప్యాసింజర్ల ట్రావెల్‌ హిస్టరీ సేకరించాలని సూచించింది.

English summary
South African scientists published Thursday suggests the Omicron variant is three times more likely to cause reinfections compared to the Delta or Beta strains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X