వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron: కొత్త వైరస్‌తో సుదీర్ఘ పోరాటం తప్పదు: అలా చేయడం వల్ల రక్షణ పొందవచ్చు: జో బైడెన్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఆఫ్రికా ఖండాన్ని దాటేసింది ఈ వైరస్. పలు దేశాల్లో అడుగు పెట్టింది. 11 దేశాల్లో తిష్ట వేసింది. ఆయా దేశాలన్నింట్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లోనూ ఈ కొత్త మహమ్మారి ఎంట్రీ ఇచ్చిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దక్షిణాఫ్రికా, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన చాలామంది భారత్‌కు వచ్చిన తరువాత కరోనా పాజిటివ్‌గా తేలారు. స్థానిక అధికారులు వారి నుంచి శాంపిళ్లను సేకరించారు. జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించారు. ఆ నివేదికలు ఇంకా అందాల్సి ఉంది.

ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇజ్రాయెల్, హాంకాంగ్, బొట్సువానా, బెల్జియం, స్విట్జర్లాండ్, కెనడాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటి సంఖ్య ప్రస్తుతానికి పరిమితంగానే ఉంటోంది. వారి ద్వారా ఎంతమందికి సోకి ఉంటుందనే విషయం ఆందోళనకు గురి చేస్తోంది. వారి కాంటాక్టులను గుర్తించడంతో పాటు.. రోజువారీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేశాయి ఆయా దేశాలన్నీ. వారంతా దక్షిణాఫ్రికా, బోట్సువానా, నైజీరియా వంటి దేశాల నుంచి స్వస్థలాలకు వెళ్లారు.

Omicron is a cause for concern but not a cause for panic, best protection is getting vaccinated: Joe Biden

ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారిగా స్పందించారు. ఒమిక్రాన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్, బూస్టర్ షాట్ తీసుకున్న వారిపై ఈ వైరస్ ప్రభావం చూపదని అన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దీని నుంచి రక్షణ పొందవచ్చని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వైరస్ పట్ల అమెరికాలో భయాందోళనలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన వెంటనే కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నామని జో బైడెన్ తెలిపారు. దక్షిణాఫ్రికాతో పాటు వైరస్ ప్రభావానికి గురైన ఆఫ్రికన్ దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేశామని అన్నారు. విమానాలను రద్దు చేయడం వల్ల వైరస్ వ్యాప్తి చెందడాన్ని కొంతమేర అడ్డుకుంటుందే తప్ప.. దాన్ని పూర్తిగా నివారించలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ వైరస్‌తో పోరాటం చేయక తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. బూస్టర్ షాట్‌ను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

Recommended Video

Omicron : Why Did WHO Name This Covid Variant As Omicron? || Oneindia Telugu

బూస్టర్ షాట్‌ను ఉచితంగా అందజేస్తున్నామని, 80 వేల కేంద్రాల్లో వాటిని అందుబాటులోకి తెచ్చామని జో బైడెన్ చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ షాట్‌ను తీసుకుంటే.. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షణ పొందినట్టేనని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ భవిష్యత్తులో విస్తరించదనే గ్యారంటీ లేదని, సుదీర్ఘకాలం పాటు దాన్ని ఎదుర్కొనక తప్పదని, పోరాటం సాగించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా దీని నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.

English summary
The US President Joe Biden asserted that the best protection against Omicron is getting fully vaccinated and getting a booster shot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X