వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron: డెల్టా కంటే డేంజరస్; కోవిడ్ నుండి కోలుకున్నవారికి సోకే ఛాన్స్: సింగపూర్ ఆరోగ్యమంత్రిత్వశాఖ

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది.కరోనా మహమ్మారి యొక్క డెల్టా మరియు బీటా వేరియంట్‌లతో పోలిస్తే కోవిడ్-19 యొక్క ఒమిక్రాన్ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని మరియు, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల తిరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ క్లినికల్ పరిశీలనలు సూచిస్తున్నాయని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కోవిడ్ నుండి కోలుకున్న వారికి ఒమిక్రాన్ సోకే ఛాన్స్

కోవిడ్ నుండి కోలుకున్న వారికి ఒమిక్రాన్ సోకే ఛాన్స్

కోవిడ్-19 నుండి కోలుకున్న వ్యక్తులకు ఒమిక్రాన్ వేరియంట్‌ తిరిగి సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని దీని అర్థం అని మంత్రిత్వ శాఖ ఆదివారం ఒమిక్రాన్ వేరియంట్‌పై తాజాగా ఓ కొత్త విషయం వెలుగులోకి తీసుకువచ్చింది. సింగపూర్ ఆదివారం మరో ఒమిక్రాన్ కేసును నివేదించింది. 37 ఏళ్ల వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా సమాచారం. డిసెంబరు 1న దక్షిణాఫ్రికా నుండి ఇక్కడకు వచ్చిన మరో రెండు ప్రిలిమినరీ పాజిటివ్ కేసులతో పాటు, ఇతను కూడా ప్రయాణం చేసినట్టు గుర్తించారు.

సింగపూర్ లో ఒమిక్రాన్ కేసులు

సింగపూర్ లో ఒమిక్రాన్ కేసులు

గత కొన్ని రోజులుగా, దక్షిణాఫ్రికా మరియు ఇతర దేశాల నుండి వచ్చిన నివేదికలను సమీక్షించామని, ప్రత్యక్ష సమాచారాన్ని పొందేందుకు ప్రభావిత దేశాలలో నిపుణులను ఫోకస్ చేసేలా ఆదేశాలు జారీ చేశామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో, సింగపూర్ కు ఇతర దేశాల నుండి వస్తున్న వారిపై జాగ్రత్తగా పరీక్షలు చేసి గుర్తించాలని పేర్కొంది.

ఒమిక్రాన్ వేరియంట్ పైన వ్యాక్సిన్ ల ప్రభావం ఉంటుందా?

ఒమిక్రాన్ వేరియంట్ పైన వ్యాక్సిన్ ల ప్రభావం ఉంటుందా?

కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా ఉన్నాయా అనే దానిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది . అయితే ప్రస్తుతం కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు ఇప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్‌ లపై పనిచేస్తాయని, ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యం నుండి ప్రజలను రక్షించడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలలో ఒక అభిప్రాయం ఉందని వెల్లడించారు. వ్యాక్సిన్ డోసులు తీసుకోదలచిన వారు టీకాలు తీసుకోవాలని లేదా వారి బూస్టర్ డోసుల కోసం వెళ్లాలని మంత్రిత్వ శాఖ కోరింది.

అలా చేయడం వలన కోవిడ్ -19 యొక్క ఇప్పటికే ఉన్న మరియు భవిష్యత్ వైవిధ్యాల నుండి రక్షించబడుతుందని బలమైన శాస్త్రీయ ఏకాభిప్రాయం ఉందని పేర్కొంది. కరోనా వైరస్ తీవ్రతకు సంబంధించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ, ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా తేలికపాటి లక్షణాలను ప్రదర్శించాయని, ఒమిక్రాన్ సంబంధిత మరణాలు ఇప్పటివరకు నివేదించబడలేదు అని చెప్తుంది. అయినప్పటికీ అప్రమత్తత అవసరం అని పేర్కొంది. నివేదించబడిన సాధారణ లక్షణాలు గొంతు నొప్పి, అలసట మరియు దగ్గు మాత్రమేనని మంత్రిత్వ శాఖ సూచించింది.

దక్షిణాఫ్రికాలో ఎక్కువగా వారిలోనే ఒమిక్రాన్ కేసులు

దక్షిణాఫ్రికాలో ఎక్కువగా వారిలోనే ఒమిక్రాన్ కేసులు

దక్షిణాఫ్రికాలో యువకులలో ఒమిక్రాన్-సంబంధిత ఆసుపత్రిలో ఎక్కువ మంది ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మరొక అంశం ఏమిటంటే, కోవిడ్-19 యేతర కారణాలతో ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన రోగులు ఆసుపత్రిలో ఉన్నప్పుడు వేరియంట్‌కు పాజిటివ్ పరీక్షించి ఉండవచ్చని, వ్యాధి తీవ్రతను నిర్ధారించడానికి ఇవి ప్రారంభ రోజులు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి మొదట యువకులు ఉన్న విశ్వవిద్యాలయ పట్టణంలో కనుగొనబడింది.

దక్షిణాఫ్రికా ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ డెమోగ్రాఫిక్ కోసం ఇప్పటివరకు ఆసుపత్రిలో చేరడం చాలా తక్కువని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ కంటే ఇది తీవ్రంగా ఉందో లేదో అంచనా వేయడానికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వృద్ధులపై మరింత సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అధికారులతో సమన్వయం ..ఒమిక్రాన్ పై అధ్యయనం

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అధికారులతో సమన్వయం ..ఒమిక్రాన్ పై అధ్యయనం

పాలీమరీస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) పరీక్షలతో పాటుగా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్‌లు, ఒమిక్రాన్ కేసులతో సహా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడంలో ప్రభావవంతంగా ఉన్నాయని ఇప్పటివరకు చేసిన అధ్యయనాలు చూపిస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి, ముందస్తు గుర్తింపు మరియు ప్రసార ప్రారంభ నియంత్రణకు పరీక్ష కీలకం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంత్రిత్వ శాఖ కూడా ఒమిక్రాన్ వేరియంట్‌ను అధ్యయనం చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అధికారులతో సమన్వయం చేసుకోవడం కొనసాగిస్తుంది, తద్వారా సాధ్యమైనంత ఉత్తమమైన ప్రతిస్పందనను అభివృద్ధి చేస్తుంది.

సింగపూర్ లో మూడు ఒమిక్రాన్ కేసులు

సింగపూర్ లో మూడు ఒమిక్రాన్ కేసులు

ఆదివారం, సింగపూర్‌లో 552 కొత్త కోవిడ్-19 కేసులు మరియు 13 మరణాలు నమోదయ్యాయి. సింగపూర్‌లో నమోదైన రెండు కేసులు గురువారం ఒమిక్రాన్ వేరియంట్‌కి "ప్రిలిమినరీ పాజిటివ్" అని పరీక్షించిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. డిసెంబర్ 1న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన తర్వాత ప్రయాణీకులు ఒంటరిగా ఉన్నారని, వారికి ఎలాంటి కమ్యూనిటీ ఇంటరాక్షన్ లేదని మంత్రిత్వ శాఖ గత వారం తెలిపింది.

ఇక తాజాగా మరో కేసు నమోదైందని వెల్లడించింది. ఆదివారం నాటికి, సింగపూర్‌లో గత సంవత్సరం మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 2,69,211 కోవిడ్-19 కేసులు మరియు 759 కరోనావైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి.

ఒమిక్రాన్ కేసులు విస్తరిస్తున్న దేశాలివే

ఒమిక్రాన్ కేసులు విస్తరిస్తున్న దేశాలివే

ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ కొనసాగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది . ఇప్పటి వరకు ఇండియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా, నైజీరియా , యునైటెడ్ కింగ్‌డమ్ ,దక్షిణ కొరియ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇజ్రాయిల్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే ,స్పెయిన్, పోర్చుగల్, స్వీడన్, కెనడా, డెన్మార్క్ దేశాలలోనూ ఒమిక్రాన్ కేసులువిస్తరిస్తున్నాయి. ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

English summary
Omicron More Infectious Than Delta, Says Singapore health ministry. Omicron variant may be more transmissible and have a higher risk of reinfection in the covid recovered patients compared to the Delta and Beta variants of the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X