వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్ఈడీ అద్భుతం: బుర్జ్ ఖలీఫాపై గాంధీ జయంతి వేడుకలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా పై గాంధీజీ ఫోటో

దుబాయ్: భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను మనదేశంతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఘనంగా నిర్వహించాయి. ఎల్‌ఈడీ వీడియో ప్రొజెక్షన్ల ద్వారా బాపు జీవితాన్ని, ఆయన ఫిలాసఫీని ప్రపంచవ్యాప్తంగా 120కిపైగా ప్రదేశాల్లో ప్రదర్శించారు.

On Gandhi Jayanti, Dubai’s Burj Khalifa pays homage by beaming Bapu’s images

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, వియన్నాలోని వెల్ట్ మ్యూజియం, బుడాపెస్ట్‌లోని బుడా కాస్ట్‌లే, రోమ్‌లోని పలాజో సెంటోరియో, ఇండోనేసియాలోని ప్రంబనన్ టెంపుల్, పెరూలోని మ్యూజియో డి ఆర్టే లాంటి ప్రాచుర్యం పొందిన 50 ప్రదేశాల్లోనూ మహాత్ముడి చిత్రాలను, వీడియోను ప్రదర్శించారు.

గాంధీజీ జీవితంలోని ముఖ్య ఘటనలు, ఆయన సూక్తులు, ఉపన్యాసాలు మొదలైనవాటితో అద్భుతంగా ఈ వీడియోను రూపొందించారు. గాంధీ బోధనలు, ఆయన నిరాడంబర జీవితాన్ని ప్రతిబింబించేలా ఈ ఇల్లస్ట్రేషన్‌కు రూపకల్పన చేశారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్.. బుర్జ్ ఖలీఫాపై ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఎల్ఈడీ ప్రదర్శనను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రపంచంలోని 120కిపైగా ప్రదేశాల్లో మన జాతిపితకు ఘన నివాళులర్పించారని తెలిపారు.

English summary
Commemorating the 150th birth anniversary of Mahatma Gandhi, Indian missions Tuesday arranged LED video projections highlighting Bapu’s life and philosophy at 120 locations globally, including at iconic landmarks such as Dubai’s Burj Khalifa and the UK’s Piccaddily Circus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X