వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడిని ఖండిస్తూనే వంకరబుద్ధి చాటుకున్న చైనా, మసూద్ అజహర్‌పై అదే వాదన

|
Google Oneindia TeluguNews

బీజింగ్/న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లో జరిగిన పుల్వామా తీవ్రవాద దాడిపై డ్రాగన్ దేశం చైనా స్పందించింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. అదే సమయంలో ఉగ్రవాది మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు సమ్మతించడం లేదు. తద్వారా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది.

పుల్వామా దాడి: 10 కి.మీ. దూరంలో ఇల్లు తీసుకొని, కారు అద్దెకు తీసుకొని.., ఐఎస్ఐ పాత్ర ఉందా?పుల్వామా దాడి: 10 కి.మీ. దూరంలో ఇల్లు తీసుకొని, కారు అద్దెకు తీసుకొని.., ఐఎస్ఐ పాత్ర ఉందా?

ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురి చేసింది

ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురి చేసింది

భారత్‌లో జరిగిన ఉగ్రదాడి చైనా దృష్టికి వచ్చిందని, ఈ దాడి ఘటన విని మేం తీవ్ర దిగ్భాంత్రికి గురయ్యామని, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, ఉగ్రవాదాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చైనా పేర్కొంది. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు తాము ఎప్పుడూ కృషి చేస్తామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి మీడియా ద్వారా తెలిపారు.

అజహర్ మీద నిషేధంపై దాటవేత

అజహర్ మీద నిషేధంపై దాటవేత

అదే సమయంలో, మీడియా ప్రతినిధిలు జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పైన ప్రశ్నించారు. అజహర్‌పై భారత్‌ నిషేధం విధించాలని చేస్తోంది కదా అని ప్రశ్నించారు. సెక్యూరిటీ కౌన్సిల్‌ జాబితాలో జేఈఎం కూడా ఉందన,ి ఈ విషయంలో ఆంక్షలు విధించేందుకు చైనా నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతమైన పద్ధతిని అవలంభిస్తోందని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా చేర్చేందుకు నిరాకరించింది. అందుకు ఆధారాలు లేవని చెప్పింది.

భారత్ డిమాండ్‌కు నో

భారత్ డిమాండ్‌కు నో

ఐక్య రాజ్య సమితిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి అతడిపై నిషేధం విధించాలని భారత్‌ పలుమార్లు చేసిన ప్రతిపాదనను భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా తిరస్కరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత్‌కు అమెరికాతో పాటు పలు దేశాలు మద్దతిచ్చాయి. అయితే మసూద్‌ ఉగ్రవాది అనేందుకు సరైన కారణాలు చూపించడం లేదని చెప్పుకొస్తూ భారత్‌ ప్రతిపాదనలను చైనా తిరస్కరిస్తోంది.

English summary
Countries from across the globe condemned the terror attack in Jammu and Kashmir's Pulwama district with nations like the United States, UK, Russia and France asserting that they stand with India in combating the menace of terrorism. China however, kept its stand on Jaish e Mohammed chief Masood Azhar unchanged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X