వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెకానిక్‌గా అవహేళన: బూర్జ్ ఖలీఫాలో 22ఫ్లాట్లు భారతీయుడి సొంతం

|
Google Oneindia TeluguNews

దుబాయ్/న్యూఢిల్లీ: ఆ భారతీయుడు ఒకప్పుడు మెకానిక్. ఇప్పుడొక ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాదు, ప్రపంచంలోనే ఎత్తైన దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫా టవర్లలో 22 ఫ్లాట్లను సొంతం చేసుకున్నాడు. ఆయనే భారత్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ వీ నేరియ పరంబిల్.

ఈ మేరకు వివరాలను అక్కడి మీడియా ఆదివారం ప్రముఖంగా ప్రచురితం చేసింది. గతంలో సాధారణ మెకానిక్‌గా జీవితం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ఖలీఫాలో వీటిని సొంతం చేసుకోవడం విశేషం.

Once a mechanic, Indian businessman now owns 22 apartments in Burj Khalifa

కాగా, ఇంతటితో తన కల పూర్తి కాలేదని, అవకాశం లభిస్తే మరిన్ని ఫ్లాట్లను కొనుగోలుచేస్తానని ఖలీజ్ టైమ్స్‌తో అన్నారు. కేరళలో జన్మించిన ఆయన.. ప్రస్తుతం దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీపాలో ఓ పెద్ద ప్రైవేట్ కంపెనీకి యజమానిగా వ్యవహరిస్తున్నారు.

ఎడారి దేశంలో వేడి ఎక్కువగా ఉండటంతో 1976లో ఏయిర్ కండీషనింగ్ బిజినెస్‌ను ప్రారంభించారు పరంబిల్. 11ఏళ్ల వయసులోనే మెకానిక్‌గా పనిచేస్తూ తండ్రి వ్యా పారంలో సహకారం అందిస్తూ బిజినెస్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు.

Once a mechanic, Indian businessman now owns 22 apartments in Burj Khalifa

ఒకప్పుడు తన బంధవు ఒకరు.. ఈ బుర్జ్ ఖలీఫాలోకి ప్రవే శించగలవా? అని అవహేళన చేశాడని, కానీ అదృష్టం కలిసి రావడంతో ఏకంగా అందులోని ఫ్లాట్లు కొనే స్థాయికి ఎదిగానని పరంబిల్ చెప్పుకొచ్చారు.

తాను సొంతం చేసుకున్న 22 ఫ్లాట్లలో ఐదింటిని అద్దెకు ఇచ్చినట్లు, మిగితా వాటి కోసం మంచి అద్దెదారుల కోసం వేచి చూస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ప్రస్తుతం పరంబిల్ దుబాయ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.

English summary
An Indian mechanic-turned-businessman owns 22 incredible apartments in Dubai's Burj Khalifa, a media report said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X