వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్కీ, గ్రీస్ లలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పై 6.3 గా నమోదు

భారీ భూకంపం, టర్కీ, గ్రీస్ దేశాలను కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతతో సంబంవించిన ఈ భూకంప కేంద్రాన్ని గ్రీక్ ద్వీపంలోని లెస్పోస్ లో గుర్తించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇజ్మీర్: భారీ భూకంపం, టర్కీ, గ్రీస్ దేశాలను కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతతో సంబంవించిన ఈ భూకంప కేంద్రాన్ని గ్రీక్ ద్వీపంలోని లెస్పోస్ లో గుర్తించారు.

భూకంపం దాటికి తీరప్రాంత లెస్పోస్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. పశ్చిమ టర్కీలోని ఏజియన్ తీరప్రాంతంలోని ఇజ్మీర్ ప్రాంతం కూడ బాగా నష్టపోయింది.

భూకంప ప్రభావంతో ఇజ్మీర్ పట్టణంలో భవనాలు, కట్టడాలు నేలమట్టమయ్యాయి. రోడ్డు రెండుగా చీలిపోయింది. భూకంప ప్రభావంతో ఓ మహిళ మృతిచెందగా, మరో 10 మంది గాయపడ్డారు. భూకంపం కారణంగా అటు గ్రీస్ లోని లెస్బోస్ లో ఎక్కువగా నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.

One dead as Aegean earthquake shakes buildings in Greece and Turkey

భవనాలు కుప్పకూలడంతో రోడ్లన్నీ మూతపడ్డాయి.ఇక్కడ 500 మంది జనాభా కలిగిన వ్రిసా గ్రామం భూకంపం ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇక్కడ చాలా ఇళ్ళు పూర్తిగా కూలిపోయాయి.ఇక్కడ ఓ మహిల భూకంప శిథిలాల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడగా, పలువురికి సాధారణ గాయాలయ్యాయని అధికారులు ప్రకటించారు.

టర్కీ, గ్రీస్ భూమి తరచూ కంపిస్తూ ఉంటుంది. అయితే ఈ సారి తీవ్రత అధికంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ భూకంపం ధాటికి టర్కీ రాజధాని ఇస్తాంబుల్, గ్రీస్ నగరం ఎథెన్స్ లోనూ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి.2011 లో టర్కీలోని వాన్ ఫ్రావిన్స్ లో 7.2 తీవ్రతతో భూకంపం సంబవించింది.ఈ ఘటనలో 800 మంది మరణించారు. టర్కీలో భయంకరమైన భూకంపం 1999 లో వచ్చింది. అప్పట్లో 20 వేల మంది ప్రాణాలను కోల్పోయారు.

English summary
A powerful 6.3 magnitude earthquake struck the western coast of Turkey and the Greek island of Lesbos, killing one woman and rattling buildings from the Aegean Turkish province of Izmir to the Greek capital Athens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X