• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో కాల్పుల కలకలం: ఒకరి మృతి, 12 మందికి గాయాలు

|

అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. ప్రముఖులతో వరసగా సమావేశం అవుతున్నారు. ఇంతలో కాల్పుల మోత మోగింది. కాల్పులు జరిగింది.. వాషింగ్టన్‌లో కాదు.. అదే కాస్త ఊరట కలిగించే అంశం. అమెరికా అంటేనే.. వర్ణ వివక్ష.. నల్ల జాతీయులపై తెల్ల జాతీయులు ఎప్పుడూ దాడులు చేస్తూనే ఉంటారు. ఇక కొన్నిచోట్ల తెలుగువారి సంగతి చెప్పక్కర్లేదు.

టెన్నెసీలో గల మెమిఫిస్ వద్ద ఓ దుండగుడు రెచ్చిపోయాడు. సూపర్ మార్కెట్ వద్ద కాల్పులు బీభత్సం సృష్టించాడు. దీంతో ఒకరు చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ప్రతీగా కాల్పులు జరిపారు. దీంతో కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయారని అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది.

ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉండగా కాల్పులు జరపడం కలకలం రేపింది.- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో వివిధ అంశాలపై మోడీ డిస్కస్ చేశారు. అగ్రరాజ్య వైస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించిన హ్యారిస్‌కు మోడీ అభినందనలు తెలిపారు. దేశ చరిత్రలో ఈ సారి జరిగిన ఎన్నిక అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. అలాగే త్వరలో భారత్ రావాలని ఈ సందర్భంగా మోడీ కోరారు. ద్వైపాక్షిక చర్చలు జరిపే ముందు ఇరువురు నేతలు మీడియాతో ముచ్చటించారు.

 One killed,12 people injured at a supermarket mass shooting

ప్రపంచంలో మిగతా వారికి ఆదర్శంగా నిలిచారని కమలా హ్యారిస్‌ను మోడీ ప్రశంసించారు. అధ్యక్షులు బైడెన్, హ్యారిస్ నేతృత్వంలో ఇరుదేశాల సంబంధాలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నారని.. భారత్ రావాలని కమలా హ్యారిస్‌ను కోరారు. కరోనా సమయంలో ఇరువురు ఫోన్‌లో మాట్లాడుకోగా.. ఆ తర్వాత తొలిసారి కలిసి.. కీలక అంశాలపై డిస్కష్ చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య 4 మిలియన్ల మంది భారత ఎన్ఆర్ఐలు బ్రిడ్జీ మాదిరిగా అనుసంధానం చేస్తున్నారని మోడీ అభిప్రాయపడ్డారు. కమలా హ్యారిస్ భారత సంతతికి చెందిన మహిళ అనే సంగతి తెలిసిందే.

  విపక్షాల మహా ధర్నాకు కదిలివచ్చిన వివిధ పార్టీల నాయకులు!!

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో మోడీ వెల్లడించారు.

  ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.

  English summary
  One person was killed,12 people injured at a supermarket mass shooting in Memphis, Tennessee; shooter deceased police said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X