వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క శాతమే హిల్లరీ కొంపముంచిందా

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే ఇద్దరు అభ్యర్థుల మద్య నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగింది.సర్వేలు, విశ్లేషకులు ముందునుండే ఇదే విషయం చెబుతున్నారు.ఎన్నికల్లో ఇవే ఫలితాలు వచ్చాయి. అయితే తొలుత :హిల్లరీ ఆధిక్యం ప్రదర్శించినట్టుగా కన్పించినా ఎన్నికల తేది దగ్గరపడే సమయానికి ట్రంప్ దూసుకుపోయాడు. అయితే ఇద్దరి మద్య ఒక్క శాతం ఓట్ల తేడా ఉంది. ఈ ఒక్క శాతం ఓట్లే శ్వేత సౌధానికి హిల్లరీని దూరం చేశాయి.

వరుసగా మూడో సారి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి శ్వేతసౌదంపై జెండా ఎగురవేస్తారని భావించిన ఆ పార్టీ మద్దతుదారులకు నిరాశే మిగిలింది. ఒక్క శాతం ఓట్లు ఈ ఎన్నికల పలితాలను ప్రభావితం చేశాయి.ఒక్క ఓటు తేడాతో వార్డు మెంబర్ ,సర్పంచ్ తదితర పదవులను కోల్పోయిన వారున్నారు. కాని ఒక్క శాతం ఓట్ల తేడాతో అమెరికా పీఠానికి హిల్లరీ దూరమయ్యారు.

one percentage difference of votes between trump and hillary

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. డెముక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ పై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో ట్రంప్ చివరి నిమిషంలో దూసుకుపోయాడు. 244 ఎలక్ట్రోరల్ ఓట్లతో ట్రంప్ ముందంజలో ఉండగా, 215 ఎలక్ట్రోరల్ ఓట్లతో హిల్లరీ వెనుకబడ్డారు. అయితే ఇద్దరి మద్య పోలైన ఓట్లలో ఒక్క శాతం ఓట్ల వ్యత్యాసమే ఉంది.

ఈ ఎన్నికల్లో ట్రంప్ కు 48 శాతం ఓట్లు వచ్చాయి, హిల్లరీకి 47 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓక్క శాతం ఓట్లు పలితాలను తారు మారు చేశాయి. లిబర్టీయన్ పార్టీ నామినీ 3 శాతం,గ్రీస్ పార్టీ నామినీ 0.9 శాతం ఓట్లతో కొనసాగుతున్నారు. ఒక్క శాతం ఓట్లు వెనుకంజలో ఉన్న కారణంగా హిల్లరీ ఓటమి పాలయ్యారు.

English summary
donald trump new president of an america. in president elections between trump and hillary tuf fight.trump got 244 elctoral votes, hillary 215 elctoral votes, trump get 48 percentage of votes, hillary get 47 percentage of votes.one percentage of votes change the hillary future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X