వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాది ఆన్‌లైన్ రొమాన్స్!!: ప్రియుడి కోసం దేశం దాటిన అమెరికా ప్రియురాలు

|
Google Oneindia TeluguNews

ఢాకా: దాదాపు ఏడాది క్రితం మైఖేల్ అపూ మోండోల్, సారా కుహ్న్‌లకు సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారు. స్వచ్ఛమైన ప్రేమకు ప్రాంతం, మతం, వ్యక్తి రంగు అడ్డు కాదని, ఎలాంటి హద్దులు ఉన్నా వాటిని తొలిచేసుకొని రావొచ్చునని ఈ జంట మరోసారి నిరూపించింది.

మైఖేల్ అపు మోండోల్ వయస్సు 28. బరిషల్‌లోని కునియా ప్రాంతవాసి. సారా కుహ్న్ వయస్సు కూడా ఇరవై ఎనిమిదేళ్లే. అమెరికన్. వీరిద్దరికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయింది. ఏడాది పాటు ఆన్‌లైన్ ద్వారానే వారు తమ ప్రేమను పంచుకున్నారు.

నర్సుగా పని చేస్తోన్న సారా

నర్సుగా పని చేస్తోన్న సారా

సారా ఓ ఓల్డ్ ఏజ్ హోంలో నర్సుగా పని చేస్తోంది. ఈమె తాను ప్రేమించిన మైఖేల్ అపూను కలిసేందుకు తన సొంత ప్రాంతమైన మిన్నెసోటా నుంచి వెళ్లింది. ఆమె బరిషల్‌కు వెళ్లింది. అక్కడి కునియా ప్రాంతంలో మైఖేల్ అపూ ఉంటున్నారు.

ఫేస్‌బుక్ పరిచయం

ఫేస్‌బుక్ పరిచయం

వీరిద్దరికి ఫేస్‌బుక్‌లో ఓ డిబేడ్ గ్రూప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు పలుమార్లు మాట్లాడుకున్నారు. నిత్యం వీడియో కాల్స్ చేసుకున్నారు. వారిద్దరు పలుమార్లు మాట్లాడుకోవడం.. వారిద్దరి మనసులను మరింత దగ్గర చేసింది. వారు ప్రేమలో పడ్డారు.

అమెరికా నుంచి ప్రియుడి వద్దకు ప్రియురాలి

అమెరికా నుంచి ప్రియుడి వద్దకు ప్రియురాలి

ఈ విషయాన్ని వారు తమ తమ పెద్దలకు చెప్పారు. వారు కూడా అంగీకరించారు. నవంబర్ 19వ తేదీన సారా ఢాకాలోని హజ్రత్ షహజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. అక్కడే ఆమె తన ప్రియుడు మైఖేల్ అపూను తొలిసారి నేరుగా కలిసింది. ఆ మరుసటి రోజు వారు మైఖోల్ అపూ సొంతూరు బరిషల్‌కు వెళ్లారు. అక్కడ అపూ కుటుంబ సభ్యులను కలిసింది.

పెళ్లి వేడుక

పెళ్లి వేడుక

ఆ తర్వాత బుధవారం నాడు తమ మతాచారం ప్రకారం స్థానిక ప్రార్థనాలయంలో రింగులు మార్చుకున్నారు. అంతేకాదు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి భారీ ఎత్తున కాకపోయినా.. పెళ్లి వేడుక కూడా నిర్వహించారు.

సారా రావడంపై అబ్బురపడిన స్థానికులు

సారా రావడంపై అబ్బురపడిన స్థానికులు

సారా ఎంతో దూరం నుంచి బంగ్లాదేశ్ వచ్చి, ఇక్కడ మైఖేల్ అపూను పెళ్లి చేసుకోవడం స్థానికులను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. ఆమె స్నేహపూర్వక మరియు ప్రేమభరితమైన హృదయం స్థానికులు అబ్బురపడ్డారు. ఆమెను ప్రశంసించారు. కాగా సారా మరికొద్ది రోజుల్లో తిరిగి అమెరికా వెళ్లిపోనుంది. అక్కడికి వెళ్లిన తర్వాత మైఖేల్ అపూ వీసాకు ప్రయత్నాలు చేయనుంది. ఒక్కసారి వీరి వీసా అప్రూవ్ అయ్యాక వారిద్దరి కలిసి జీవించనున్నారు.

English summary
Love has once again proven that it knows no boundaries of race, caste or creed, and that it can make one travel across an entire ocean just to be with each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X